Mahima gala Raja song lyrics :
మహిమ గల రాజా - నిన్నే స్తుతియింతుము
మహోన్నత దేవా - నిన్నే కీర్తింతుము
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
కష్టమైనా నష్టమైనా - నిన్నే కొనియాడెదం
శోధనలైనా వేదనలైనా - నీకై జీవింతుము
ఎన్ని నిందలొచ్చినా - ఎన్ని బాధలొచ్చినా
నీకొరకే మేం నిలుతుము యేసురాజా - రాజులరాజా......
1. నత్తివాడైన మోషేను - నాయకుడిగా చేసేను
గొల్లవాడైన దావీదును - గొప్ప రాజుగా మార్చేను
బానిసైన యోసేపును - బహుగా బహుగా దీవించెను
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
2. పిరికివాడైన పేతురును - పౌరుషముతో నింపేను
పొట్టివాడైన పౌలును - గట్టివాడిగా చేసేను
అనుమానించే తోమాను - సిలువసాక్షిగా మార్చేను
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
No comments:
Post a Comment