Breaking

Tuesday, 22 March 2022

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక (పరిచయం)

 



రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.


వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 60లో.


ముఖ్యాంశం:

క్రీస్తు రాయబారి పౌలు ఖైదులో ఉన్నప్పుడు ఈ లేఖ రాశాడు. ఫిలేమోను దాసులలో ఒకడైన ఒనేసిమస్ పారిపోయి పౌలు ఉన్న స్థలానికి వచ్చాడు. పౌలు ద్వారా అతడు క్రీస్తు శుభవార్త విని నమ్ముకొన్నాడు. ఇప్పుడు పౌలు అతణ్ణి అతని యజమాని దగ్గరకు పంపుతున్నాడు. అతని పేరుకు ‘ప్రయోజనం’ అని అర్థం. అంతకుముందు అతడు ఫిలేమోనుకు పనికిమాలినవాడుగా ఉన్నా ఇప్పుడు దేవుని కృపచేత పౌలుకూ ఫిలేమోనుకూ, మరి ముఖ్యంగా యేసు క్రీస్తుకూ ప్రయోజనకరమైనవాడయ్యాడు. ఈ చిన్న లేఖ ముఖ్యాంశం దేవుని పిల్లలపట్ల చూపవలసిన ఆదర్శ ప్రేమ (12-18 వచనాలు).


విషయసూచిక

పౌలు ముందు మాటలు 1-3 వచనాలు

ఫిలేమోను కోసం ప్రార్థన, కృతజ్ఞతలు 4-6 వచనాలు

ఫిలేమోను జీవితం పౌలుకు ఓదార్పు 7 వ వచనం

ఒనేసిమస్ గురించి పౌలు విన్నపం 8-21 వచనాలు

పౌలు తనకోసం చేసుకొన్న విన్నపం 22 వ వచనం

ముగింపు మాటలు 23-25 వచనాలు

No comments:

Post a Comment