రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. దాదాపు 65లో.
ముఖ్యాంశం:
తిమోతికి రాసిన మొదటి లేఖలాగే ఈ లేఖలో ముఖ్యాంశం క్రీస్తుసంఘంలో యోగ్యమైన ప్రవర్తన, సేవ. అపొ కా గ్రంథంలో తీతును గురించి రాసినది ఏమీ లేకపోయినా అతడు పౌలుకు సన్నిహితుడు, నమ్మకంగా దేవుని సేవ చేసినవాడు (2 కొరింతు 7:6-7; 8:6, 16; గలతీ 2:1). ఇప్పుడు తీతు(టైటస్) మధ్యధరా సముద్రంలోని క్రేతు లంకలోని సంఘాలమధ్య సేవ చేస్తూ ఉన్నాడు. అతని విశ్వాసాన్ని బలపరచడానికి, సంఘ విషయాలు కొన్నిటి గురించి ఉపదేశించడానికి పౌలు దైవావేశపూర్వకంగా ఈ లేఖ రాశాడు.
విషయసూచిక
ముందు మాటలు 1:1-4
సంఘ పెద్దలకు ఉండవలసిన యోగ్యతలు 1:5-9
వదరబోతులు, మోసగాళ్ళు 1:10-16
వివిధ రకాల ప్రజలకు ఆదేశాలు 2:1-10
దేవుని కృప నేర్పించేది 2:11-15
విశ్వాసులు ప్రవర్తించవలసిన విధానం 3:1-2
క్రీస్తును నమ్మకముందు విశ్వాసులు జీవించిన విధానం 3:3
కృపవల్లే రక్షణ కలిగింది 3:4-7
రక్షణ పొందినవారు మంచి పనులు చేయాలి 3:8
వ్యర్థమైన జగడాలు, చీలికలు కలిగించే మనుషులు 3:9-11
ముగింపు మాటలు 3:12-15
No comments:
Post a Comment