రచయిత, వ్రాసిన కాలం:
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోని యూద క్రైస్తవులకు రాసిన ఈ లేఖ ఎవరు రాశారో మనకు తెలియదు. సాంప్రదాయం ప్రకారం హీబ్రూవారికి (అంటే, యూద క్రైస్తవులకు) ఈ లేఖ రాసినది క్రీస్తు రాయబారి పౌలు. అయితే దానికి రుజువు లేదు. రాసినది అపొల్లో అని కొందరి అభిప్రాయం. మరికొందరు సైలస్ రాశాడేమో, మరికొందరు బర్నబా రాశాడేమో అంటారు. ఈ అభిప్రాయాలకు కూడా రుజువు లేదు. ఒక విషయం మాత్రం స్పష్టమే – ఈ దివ్య లేఖ దేవుని పవిత్రాత్మ ఆవేశపూర్వకంగా కలిగింది. ఇది రాసినది క్రీ.శ. 70కు ముందు.
ముఖ్యాంశం:
ఈ లేఖ ముఖ్యాంశం యేసు క్రీస్తు ద్వారా కలిగిన కొత్త ఒడంబడిక. ఇది మోషే ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చేసిన ఒడంబడిక కంటే అన్ని విధాలా శ్రేష్ఠమైనదని రచయిత నొక్కి చెపుతూ నిరూపించాడు. కొందరు యూద క్రైస్తవులు హింసలకు గురై ఈ సత్యాన్ని మరచిపోయి కొత్తదానిని విడిచిపెట్టి పాతదానివైపు మళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. అందుచేత కొత్త ఒడంబడిక శ్రేష్ఠతను గురించిన రుజువులు మాత్రమే గాక ఈ శ్రేష్ఠమైన దానిని విడిచిపెట్టాలనుకొనే వారికి అయిదు కఠినమైన హెచ్చరికలు కూడా ఇందులో రాసి ఉన్నాయి. ఈ లేఖకు మూల పదం “శ్రేష్ఠమైన” (1:4; 7:19, 22; 8:6; 9:23; 10:34; 11:16, 35, 40; 12:24). మూల వాక్కులు 10:19-22 అనవచ్చు. ఈ లేఖలో “నమ్మకం” అనే మాటకు కూడా ప్రాముఖ్యత ఉంది. నమ్మకాన్ని గురించిన ప్రసిద్ధమైన అధ్యాయం దీనిలో ఉంది (11వ అధ్యా). దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు, ఆయన చెప్పినది అందరూ నమ్మాలి అనేదీ ఈ లేఖ సారాంశం.
విషయసూచిక
క్రీస్తు దేవదూతలకంటే శ్రేష్ఠుడు 1:1—2:18.
ఆయన దేవుని కుమారుడు, అన్నిటికీ వారసుడు,
సృష్టిని చేయడంలో పాలిభాగస్తుడు 1:2,5
ఆయన దేవుని స్వరూపం 1:3
ఆయన విశ్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు 1:3
ఆయన మన పాపాల విషయంలో శుద్ధీకరణ చేశాడు 1:3
ఆయన సంపూర్ణ బలప్రభావాలున్న స్థలంలో కూర్చున్నాడు 1:3,13
దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తారు 1:6
ఆయన దేవుడుగా పాలిస్తాడు 1:7-9
ఆయన శాశ్వత సృష్టికర్త 1:10-12
మొదటి హెచ్చరిక: కొట్టుకుపోవద్దు 2:1-4
రాబోయే ప్రపంచాన్ని దేవదూతలు కాదు, యేసు పాలిస్తాడు 2:5
యేసు తాత్కాలికంగా దేవదూతలకంటే తక్కువ స్థానంలో ఉన్నాడు,
కానీ ఇప్పుడు వారికంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు 2:6-9
యేసు కొంతకాలం పాటు దేవదూతలకంటే
తక్కువగా ఉండడానికి కారణం 2:10-18
యేసు మోషే, యెహోషువలకంటే శ్రేష్ఠుడు 3:1—4:16
మోషే ఇంటిలో పని చేశాడు కానీ యేసు ఇంటిని కట్టాడు 3:2-6
రెండవ హెచ్చరిక: అవిశ్వాసం ద్వారా అవిధేయత చూపవద్దు 3:7—4:2
యెహోషువ ప్రజలను విశ్రాంతి స్థలానికి
నడిపించలేకపోయాడు కానీ యేసు నడిపించగలడు 4:3-16
యేసు గొప్ప ప్రముఖయాజి 4:14-16
క్రీస్తు యాజిధర్మం అహరోను యాజిధర్మం కంటే శ్రేష్ఠం 5:1—8:5
పాత ఒడంబడిక యాజుల విధులు 5:1-3
దేవుని పిలుపు అందినవారు 5:4-6
మెల్కీసెదెకు వరుస 5:6-10
మూడో హెచ్చరిక: మీరు పడిపోవద్దు 5:11—6:8
రచయిత నిశ్చయత 6:9-12
వాగ్దానాల విషయంలో దేవుని విశ్వసనీయత 6:13-20
మెల్కీసెదెకు, అబ్రాహాము, లేవి 7:1-10
ప్రముఖయాజి అయిన యేసు మెల్కీసెదెకు లాంటివాడు 7:11-17
పాత ఒడంబడిక యాజి ధర్మం బలహీనంగా ఉండి
చేయవలసిన కార్యం చేయలేకపోయింది 7:18-19
యేసు దేవుని వాగ్దానం ద్వారా ప్రముఖయాజి అయ్యాడు 7:20-22
యేసు ప్రముఖయాజి ధర్మం శాశ్వతమైనది 7:23-25
ప్రజలకు సరిగ్గా అవసరమైన ప్రముఖయాజి యేసు 7:26-28
యేసు పరలోకంలో ఉన్న నిజమైన ఆరాధన గుడారంలో సేవ చేస్తాడు 8:1-5
కొత్త ఒడంబడిక పాత ఒడంబడిక కంటే శ్రేష్ఠం 8:6—10:18
కొత్త ఒడంబడికకు యేసు మధ్యవర్తిగా ఉన్నాడు 8:6
కొత్త ఒడంబడికకు శ్రేష్ఠమైన వాగ్దానాలున్నాయి 8:6
కొత్త ఒడంబడిక ఎంతో అవసరమైనది 8:7-8
ఈ కొత్త ఒడంబడికను గురించి దేవుడు పాత ఒడంబడికలో
ప్రస్తావిస్తూ దానికి కారణం రాశాడు 8:8-13
యాజులు పాత ఒడంబడికకు లోబడి పని చేశారు 9:1-10
యేసు పని కొత్త ఒడంబడికలోనిది 9:11-28
యేసు చేసిన ఒక్క బలి విశ్వాసులను ఎప్పటికీ పరిపూర్ణులుగా చేస్తుంది 10:1-18
సజీవమైన కొత్త మార్గం 10:19-22
కొత్త ఒడంబడికకు అనుగుణంగా నివసించడానికి ప్రోత్సాహం 10:22-25
నాల్గవ హెచ్చరిక: కొత్త ఒడంబడికను బుద్ధిపూర్వకంగా
త్రోసిపుచ్చి పాపంలో నిలిచి ఉండకండి 10:26-31
యూద క్రైస్తవుల పరిస్థితి, వారు విశ్వాసంలో పెరగవలసిన అవసరం 10:32-39
విశ్వాసం అంటే ఏమిటి? అది ఏమి చేస్తుంది?
పాత ఒడంబడిక నుంచి ఉదాహరణలు 11:1-40
ముందు అధ్యాయం మీద ఆధారపడిన ప్రోత్సాహ వాక్కులు 12:1-17
పాపాన్ని, ఆటంకాలను త్రోసిపుచ్చాలి 12:1
పందెంలో ఓర్పుతో పరుగెత్తాలి 12:1
యేసువైపు చూడాలి 12:2
ఆయన్ను తలచుకోవాలి 12:3
దేవుని క్రమశిక్షణను అలవర్చుకోవాలి 12:5-13
శాంతినీ, పవిత్రతనూ అనుసరించాలి 12:14
మంచి వేరులో పాదుకొనేలా చూచుకోండి 12:15
ఏశావులాగా ఉండవద్దు 12:16-17
పాత ఒడంబడికకూ, కొత్త ఒడంబడికకూ మధ్య ఉన్న భేదం 12:18-24
ఐదవ హెచ్చరిక: పరలోకంనుంచి మాట్లాడిన దేవుణ్ణి తిరస్కరించవద్దు 12:25-29
ప్రోత్సాహకరమైన ముగింపు 13:1-22
గొప్ప వాగ్దానం 13:5-6
యేసు నిరంతరం 13:8
శిబిరం బయట యేసును కలుసుకొందాం 13:10-14
దేవునికి ఇష్టమైన మూడు అర్పణలు 13:15-16
ప్రతి విశ్వాసిలో దేవుడు చేయదలచుకున్న పని 13:20-21
ముగింపు మాటలు 13:23-25.
No comments:
Post a Comment