రచయిత:
లూకా వైద్యుడు. ఇతడు పౌలుకు మంచి స్నేహితుడై, పౌలు శుభవార్త ప్రయాణాలలో తరచు అతనితో ప్రయాణం చేశాడు. కొలస్సయి 4:14; 2 తిమోతి 4:11; ఫిలేమోను 24; అపొ కా 16:10-12; 20:5-6; 27:1.
వ్రాసిన కాలం:
లూకా ఈ పుస్తకాన్ని మొదటి శతాబ్దంలో అంటే యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే రాశాడు.
ముఖ్యాంశం:
ప్రజల రక్షణకోసం దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడు యేసు క్రీస్తు. కొన్ని ముఖ్యమైన మాటలు రక్షణ, విముక్తి, శుభవార్తను ప్రకటించడం. యెషయా 61:1-2 వచనాల్లో ఉన్న మాటలలో యేసు తన పరిచర్యను ప్రారంభించాడు (4:18), తప్పిపోయిన వాణ్ణి వెదికి రక్షించడమే తన పని అని బయల్పరచాడు (9:10). లూకా యేసుప్రభువును “మానవపుత్రుడుగా” చూపిస్తున్నాడు. యేసు క్రీస్తు పుట్టుక, జీవితం, ఆయన మానవ స్వభావం గురించి ఇతర శుభవార్తల రచయితలకంటే ఎక్కువ విపులంగా, విశదంగా లూకా రాశాడు.
విషయసూచిక
లూకా తాను రాసిన శుభవార్తను పరిచయం చేశాడు 1:1-4
బాప్తిసం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు 1:5-25
దేవదూత మరియ దగ్గరకు వచ్చాడు 1:26-38
ఎలీసబెతు మరియను దర్శించినది 1:39-55
బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టుక 1:56-80
యేసుప్రభువు పుట్టుక 2:1-20
యేసు సున్నతి సంస్కారం 2:21-24
సుమెయోను మాటలు 2:25-35
అన్నా ప్రవక్తి 2:36-38
బాలుడైన యేసు జెరుసలంలో నజరేతులో 2:39-52
బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య 3:1-20
యేసు బాప్తిసం 3:21-23
యేసు వంశావళి 3:24-38
యేసుకు అరణ్యంలో పరీక్షలు 4:1-13
యేసు తన పరిచర్యను ప్రారంభించాడు 4:14-44
యేసు నజరేతులో 4:14-30
యేసు కపెర్నహూంలో 4:31-44
అద్భుతంగా ఎక్కువ సంఖ్యలో చేపలు పట్టారు 5:1-11
యేసు కుష్ఠురోగిని బాగు చేశాడు 5:12-16
యేసు పక్షవాతరోగిని బాగు చేసి క్షమించాడు 5:17-26
యేసు లేవిని పిలిచి అతని ఇంటిలో భోజనం చేశాడు 5:27-39
యేసు, విశ్రాంతి దినం 6:1-5
యేసు చేయి ఎండిపోయినవాణ్ణి బాగు చేశాడు 6:6-11
యేసు తన శిష్యులను ఎన్నుకొన్నాడు 6:12-16
యేసు సమతలం మీద ఇచ్చిన సందేశం 6:20-49
యేసు శతాధిపతి దాసుణ్ణి బాగు చేశాడు 7:1-10
యేసు చనిపోయిన యువకుణ్ణి బ్రతికించాడు 7:11-17
యేసు బాప్తిసం ఇచ్చే యోహానుకు సమాధానం చెప్పాడు 7:18-23
యేసు బాప్తిసం ఇచ్చే యోహానును ఘనపరచాడు 7:24-35
యేసు పరిసయ్యుడైన సీమోను ఇంట్లో 7:36-50
విత్తనాల ఉదాహరణ 8:4-15
యేసు తన తల్లి, సోదరుల గురించి మాట్లాడాడు 8:19-21
యేసు తుఫానును మందలించాడు 8:22-25
యేసు పిశాచాల సేనను వెళ్ళగొట్టాడు 8:26-39
యేసు యాయీరు కుమార్తెను బ్రతికించి రక్తస్రావం ఉన్న స్త్రీని బాగు చేశాడు 8:40-56
యేసు తన రాయబారులను బయటికి (ప్రకటించడానికి) పంపాడు 9:1-6
యేసు ఐదువేల మందికి ఆహారం పెట్టాడు 9:10-17
యేసు ఆయన ఎవరో బయల్పరుస్తూ తన మరణాన్ని,
తిరిగి సజీవంగా లేవడం గురించి చెప్పాడు 9:18-22
యేసు తన శిష్యులకు ఉండవలసిన లక్షణాలను బయల్పరచాడు 9:23-27
యేసు దివ్యరూపం 9:28-36
యేసు దయ్యం పట్టిన పిల్లవాణ్ణి బాగు చేశాడు 9:37-45
యేసు నిజమైన గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు 9:46-48
యేసు జెరుసలం ప్రయాణం ప్రారంభం 9:49-56
యేసు ఆయనను అనుసరించేవారు 9:57-62
యేసు డెబ్భైమంది శిష్యులకు ఆదేశాలిచ్చి పంపాడు 10:1-21
యేసు తన దేవత్వాన్ని బయల్పరచాడు 10:22-24
మంచి సమరయవాడి గురించిన ఉదాహరణ 10:25-37
యేసు, మరియ, మార్త 10:38-42
యేసు ప్రార్థన నేర్పాడు 11:1-13
యేసును యూదుల అధికారులు అవమానించారు 11:14-26
యేసు నిజమైన ధన్యతను గురించి చెప్పాడు 11:27-28
యేసు చెడ్డతరంవారిని ఎదుర్కొన్నాడు 11:29-36
యేసు యూదుల అధికారుల నడతను బయల్పరచాడు 11:37-54
యేసు తన శిష్యులను యూదుల అధికారుల విషయంలో హెచ్చరించాడు 12:1-12
మూర్ఖుడైన ధనవంతుని ఉదాహరణ 12:14-21
యేసు తన శిష్యులకు భయపడవద్దని చెప్పాడు 12:22-34
యేసు తన రెండవ రాక గురించి చెప్పాడు 12:35-48
యేసు చీలికలు కలిగిస్తాడు 12:49-53
యేసు పాపుల పశ్చాత్తాపాన్ని కోరాడు 13:1-5
మోడువారిన చెట్టు ఉదాహరణ 13:6-9
యేసు విశ్రాంతి రోజున ఒక స్త్రీని బాగు చేశాడు 13:10-17
దేవుని రాజ్యాన్ని గురించిన ఉదాహరణలు 13:18-21
యేసు చెప్పిన రక్షణను గురించిన ఒకే ఒక మార్గం 13:22-30
యేసు జెరుసలం విషయం దుఃఖించాడు 13:34-35
యేసు ఒక పరిసయ్యుడి ఇంట్లో భోజనం చేశాడు 14:1-15
గొప్ప విందును గూర్చిన ఉదాహరణ 14:16-24
యేసు శిష్యత్వానికి కావలసిన గుణలక్షణాలను తెలియజేసాడు 14:25-35
యేసు తప్పిపోయిన గొర్రెలు, పోయిన నాణెం,
తప్పిపోయిన కొడుకును గురించిన ఉదాహరణలు చెప్పాడు 15:1-32
న్యాయం తప్పిన గృహనిర్వాహకుని గురించి ఉదాహరణ 16:1-9
యేసు నమ్మకమైన సేవను గురించి మాట్లాడాడు 16:10-13
లాజరు, ధనవంతుని గురించిన ఉదాహరణ 16:19-31
యేసు అపరాధాలు, క్షమాపణ గురించి ఉపదేశించాడు 17:1-4
యేసు నమ్మకం ఎలా వృద్ధి పొందుతుందో చూపించాడు 17:5-10
యేసు పది మంది కుష్ఠురోగులను బాగు చేశాడు 17:11-19
యేసు తన రెండవ రాకను గురించి చెప్పాడు 17:20-37
యేసు ప్రార్థన గురించి మళ్ళీ ఆదేశం ఇచ్చాడు 18:1-8
పరిసయ్యుడు, సుంకంవాడి గురించిన ఉదాహరణ 18:9-14
యేసు చిన్న పిల్లలను ఆహ్వానించాడు 18:15-17
యేసు, ఆస్తిపరుడైన యువకుడు 18:18-30
యేసు తన మరణం, తిరిగి లేవడం గురించి చెప్పాడు 18:31-34
యేసు యెరికోలో గ్రుడ్డివాడిని బాగు చేశాడు 18:35-43
యేసు, జక్కయ్య 19:1-10
దాసులు, బంగారు నాణేల ఉదాహరణ 19:11-27
యేసు గాడిదమీద జెరుసలం వెళ్ళి దాని విషయం ఏడ్చాడు 19:28-44
యేసు యూదుల అధికారుల వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ద్రాక్షతోట ఉదాహరణ 20:1-47
యేసు కానుకల గురించి బోధించాడు 21:1-4
యేసు భవిష్యత్తును తెలియజేశాడు 21:5-36
యేసును ఇస్కరియోతు యూదా అప్పగించాడు 22:1-6
యేసు తన శిష్యులతో ఆఖరి పస్కాపండుగ భోజనం తీసుకున్నాడు 22:7-22
యేసు నిజమైన గొప్పతనాన్ని గురించి చెప్పాడు 22:24-30
యేసు, పేతురు తనను ఎరుగనంటాడని ముందుగా చెప్పాడు 22:31-34
యేసు గెత్‌సేమనే తోటలో 22:39-46
యేసును బంధించడం 22:47-54
పేతురు యేసును ఎరగనన్నాడు 22:55-62
యేసు ప్రముఖ యాజి సమక్షంలో 22:63-71
యేసు పిలాతు సమక్షంలో 23:1-25
యేసు కల్వరికి వెళ్ళాడు, అక్కడ సిలువ వేయబడ్డాడు 23:26-38
పశ్చాత్తాపపడ్డ దొంగ 23:39-43
యేసు మరణం, భూస్థాపన 23:44-56
యేసు చనిపోయినవారిలోనుండి లేచాడు 24:1-7
యేసు, శిష్యుల అపనమ్మకం 24:8-12
యేసు ఎమ్మాయస్ దారిలో ఇద్దరు శిష్యులకు కనబడ్డాడు 24:13-32
యేసు తన రాయబారులకు కనబడ్డాడు 24:33-44
యేసు తన శిష్యులకు లేఖనాలను వివరిస్తూ ఏమి చేయాలో చెప్పాడు 24:45-49
యేసు పరలోకానికి ఆరోహణం 24:50-52
No comments:
Post a Comment