రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. 50-54 మధ్య కాలంలో.
ముఖ్యాంశాలు:
పౌలు తన రెండో శుభవార్త ప్రచార ప్రయాణంలో తెస్సలొనీక పట్టణానికి వెళ్ళి శుభవార్త ప్రకటించాడు. కొందరు క్రీస్తును నమ్మి విగ్రహాలను విడిచిపెట్టి శిష్యులయ్యారు (అపొ కా 17:1-9). ఇప్పుడు క్రీస్తుమీది వారి నమ్మకాన్ని స్థిరపరచడానికి, వారి విషయంలో తనకున్న సంతోషం తెలపడానికి, అవసరమైన ఉపదేశం చేయడానికి పౌలు రాస్తున్నాడు. ఈ లేఖ ముఖ్యాంశం యేసు క్రీస్తు రెండో రాకడ. ప్రతి అధ్యాయంలోనూ ఆయన రెండో రాకడను పౌలు పేర్కొన్నాడు (1:10; 2:19; 3:13; 4:13-17; 5:1-4). యేసు క్రీస్తు మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన ప్రజను తన దగ్గరకు చేర్చుకొంటాడు, గనుక విశ్వాసులు ఈ దివ్య సత్యానికి తగినట్టుగా బతకాలనీ గొప్ప ఆశాభావం కలిగి ఆనందించాలనీ పౌలు రాశాడు.
విషయసూచిక
పౌలు ప్రార్థన, కృతజ్ఞతలు 1:2-3
ఆదర్శ సంఘం 1:4-10
ఆదర్శ క్రైస్తవ పనివారు 2:1-12
ధైర్యం 2:1-2
నిజాయితీ, నమ్మకత్వం, మంచి ఉద్దేశాలు 2:3-6
ప్రేమించే హృదయాలు 2:7-8
నిత్య ప్రయాస 2:9
పవిత్ర జీవితాలు 2:10
తండ్రిలాంటి ప్రవర్తన 2:11-12
మరిన్ని కృతజ్ఞతలు 2:13-14
యూదుల వ్యతిరేకత 2:14-16
విశ్వాసులంటే పౌలుకున్న ప్రేమ 2:17-20
పౌలు తిమోతిని తెస్సలొనీకకు పంపడం 3:1-5
తిమోతి తెచ్చిన కబురు 3:6
తెస్సలొనీకవారిని దర్శించాలని పౌలు ఆశ, అతని ఓదార్పు 3:7-11
వారికోసం పౌలు ప్రార్థన 3:12-13
దేవుణ్ణి సంతోషపెట్టడానికే జీవించడం 4:1-12
పవిత్ర జీవితం 4:3-8
సోదర ప్రేమ 4:9-10
ఆకర్షణీయమైన జీవిత విధానం 4:11-12
క్రీస్తు తిరిగి రావడం, సంఘం పైకెత్తబడడం 4:13-18
కాలాలు, సమయాలు 5:1-4
వెలుగు సంతానంలాగా జీవించడం 5:5-11
ముగింపు మాటలు 5:12-27
No comments:
Post a Comment