రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. 50-54 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
మొదటి లేఖలాగే ఈ లేఖ ముఖ్యాంశం క్రీస్తు రెండో రాకడ. ఈ సంఘం హింసలకూ కడగండ్లకూ గురి అయిన సమయంలో కొందరు దుర్బోధ చేసి ప్రభు దినం అప్పటికే వచ్చిందంటూ వారిని కలవరపెట్టారు (2:1-2). ప్రభు దినం అంటే ఆయన మహా కోప దినం, అవిశ్వాసులను దండించే దినం. ఆ దినం రాకముందు ‘న్యాయ విరోధి’ అనే పాపిష్ఠి మనిషి ప్రత్యక్షం కావాలని పౌలు రాశాడు. ఈ ‘న్యాయ విరోధి’ యుగ సమాప్తిలో రాబోయే క్రీస్తు విరోధి. 1 యోహాను 2:18; ప్రకటన 13వ అధ్యాయం; మత్తయి 24:15-24 చూడండి. ఈ తెస్సలొనీక విశ్వాసులు భయపడకుండా క్రీస్తును గురించిన సత్యాన్ని గట్టిగా చేపట్టాలని ఉద్బోధిస్తూ పౌలు వారిని ఓదార్చాడు.
విషయసూచిక
హింసలమధ్య పెరుగుతున్న ప్రేమ, విశ్వాసం 1:3-5
హింసించేవారికి, అవిధేయులకు శిక్ష 1:6-9
క్రీస్తుకు తన ప్రజలలో మహిమ కలుగుతుంది 1:10
వారి కోసం పౌలు ప్రార్థన, దానికి కారణం 1:11-12
క్రీస్తు రాకడ 2:1-2
క్రీస్తు విరోధి రాకడ 2:3-8
క్రీస్తు న్యాయ విరోధిని నాశనం చేస్తాడు 2:8
క్రీస్తు విరోధి ప్రజలను మోసం చేయగలగడానికి కారణం 2:9-12
వింతలు, సూచనలు, అద్భుతాలు 2:9-10
సత్యంపట్ల ప్రేమ లేకపోవడం 2:10
దేవుడు వారిని మోసగించే ప్రభావంతో శిక్షిస్తాడు 2:11-12
ప్రభువైన క్రీస్తు ప్రేమకు పాత్రులై,
దేవుని ఆత్మచేత పవిత్రులై, శుభవార్తద్వారా పిలుపు అందినవారు 2:13-14
నిలకడగా ఉండడం 2:15-17
ప్రార్థన, విన్నపం 3:1-2
పౌలు ప్రార్థన, నమ్మకం 3:3-5
సోమరితనానికి వ్యతిరేకంగా హెచ్చరిక 3:6-15
పౌలు ఉదాహరణ 3:7-9
ముగింపు మాటలు 3:16-18
No comments:
Post a Comment