రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. దాదాపు 67లో.
ముఖ్యాంశాలు:
క్రీస్తు రాయబారి పౌలు తిమోతికి రాసిన ఈ రెండో లేఖలో వ్యక్తిగతమైన విషయాలు అనేకం ఉన్నాయి. పౌలు హింసలకు గురి అయి రోమ్ నగరంలో ఖైదీగా ఉన్నాడు (1:8). మొత్తం మీద అతని మిత్రులు, సహకారులు అంతా అతణ్ణి విడిచివెళ్ళారు (1:15; 4:16). అతడు హతం కాబోయే సమయం దగ్గరపడింది (4:6). అయినా అతనికి ఏమీ నిరుత్సాహం, దుఃఖం, భయం లేవు. ఆశాభావంతో విశ్వాస నిశ్చయతతో నిండి ఉన్నాడు. తాను చేసిన సేవ విషయంలో అతనికి చాలా తృప్తి, సంతోషం కలిగాయి (4:7-8). చనిపోకముందు మరోసారి దేవుని సేవకుడైన తిమోతికి సరైన సిద్ధాంతాల ప్రాముఖ్యత విషయం, పవిత్ర జీవితం విషయం, నమ్మకమైన సేవ విషయం రాయాలని పవిత్రాత్మ ఆవేశం అతనికి కలిగింది, గనుక ఈ లేఖ రాశాడు.
విషయసూచిక
పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకోవడం, అతణ్ణి చూడాలన్న ఆశ, కృతజ్ఞతలు 1:3-5
సేవలో ఉత్సాహంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడం 1:6-8
విముక్తి కలిగించే దేవుని కృప 1:9-10
పౌలు నియామకం 1:11-12
సత్యాన్ని కాపాడుమని ప్రోత్సహించడం 1:13-14
విడిచిపోయినవారు, సహాయం చేసినవారు 1:15-18
సత్యాన్ని ఇతరులకు అందించడం 2:1-2
మంచి ఉత్సాహపూరితమైన సేవ చేయడానికి ఉదాహరణలు 2:3-7
సైనికులు 2:3-4
ఆటగాడు 2:5
రైతు 2:6
పౌలు శుభవార్త, దానికోసం అతను చెల్లించిన వెల 2:8-10
నమ్మదగిన మాట 2:11-13
పనికిమాలిన, ప్రమాదకరమైన బోధ 2:14-19
వివిధ రకాల పాత్రలు 2:20-21
వదిలిపెట్టవలసిన సంగతులు 2:22-24
సైతాను బీకర శక్తి 2:25-26
చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారు 3:1-9
తిమోతి పౌలు ఆదర్శాన్ని అనుసరించాలి 3:10-14
బైబిలు దైవావేశం వల్ల కలిగినది, బైబిలు ఉపయోగం 3:15-17
క్రీస్తు సేవకుల ముఖ్యమైన పని, ఇంకా చాలామంది ఎలా ఉంటారు 4:1-5
తన జీవితం చివరి రోజుల్లో పౌలు ఆశ, సంతోషం 4:6-8
వ్యక్తిగత వాక్కులు 4:9-15
పౌలు అనుభవం, ఆత్మ నిబ్బరం 4:16-18
ముగింపు మాటలు 4:19-22
No comments:
Post a Comment