Breaking

Sunday, 20 March 2022

1 తిమోతి (పరిచయం)




రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి పౌలు.


వ్రాసిన కాలం:

క్రీ.శ. దాదాపు 64లో.


ముఖ్యాంశాలు:

క్రీస్తు రాయబారి పౌలు విశ్వాస విషయంలో తన కుమారుడూ, శుభవార్త సేవలో సన్నిహితుడూ అయిన తిమోతికి ఈ లేఖ రాసినప్పుడు అప్పటికి క్రీస్తు సంఘాల సంఖ్య అధికంగా పెరిగిపోయింది. సంఘాలలో సత్‌ప్రవర్తన, క్రమం, శిక్షణ, నాయకత్వం మొదలైన వాటి గురించిన సమస్యలు కలిగాయి. ఈ విషయాల గురించి పౌలు తిమోతికి రెండు లేఖలు, తీతుకు ఒక లేఖ రాశాడు. అతడు క్రీస్తు రాయబారి. ప్రభువు ఇచ్చిన అధికారంతో, పవిత్రాత్మ ఆవేశంతో రాశాడు గనుక ఈ ఆదేశాలూ ఉపదేశాలూ అన్ని కాలాలలోని సంఘాలకూ వర్తిస్తాయి. ఈ లేఖకు మూలవాక్కు 3:15 అనవచ్చు – “దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసేలా ఈ సంగతులు రాస్తున్నాను.”


విషయసూచిక

మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధించేవారు 1:3-7

ధర్మశాస్త్రాన్ని తగినవిధంగా ఉపయోగించడం 1:8-11

దేవుని కృపవల్ల పాపవిముక్తి పొందిన పౌలు 1:12-17

ప్రముఖ పాపి 1:15

కరుణకు ఉదాహరణ 1:16

దీనికోసం దేవునికి స్తోత్రం 1:17

మంచి ఆధ్యాత్మికమైన పోరాటం పోరాడడం 1:18-19

పగిలిన ఓడలాంటి క్రైస్తవులు 1:19-20

ప్రార్థన మొదలైన వాటి గురించి ఆదేశాలు 2:1-4

ఒకే దేవుడు, ఒకే మధ్యవర్తి, ఒకే విడుదల వెల 2:5-8

క్రైస్తవ స్త్రీలకుండవలసిన సరైన ప్రవర్తన, వస్త్రాలంకరణ 2:9-15

సంఘ నాయకులకు, పరిచారకులకు ఉండవలసిన యోగ్యతలు 3:1-15

శరీరంలో దేవుని రహస్య సత్యం 3:16

పిశాచాల సిద్ధాంతాలు 4:1-5

క్రీస్తుకు మంచి సేవకుడు 4:6-16

ఇతరులకు సత్యాన్ని బోధించడం 4:6,11,13

అనవసరమైన విషయాలను విసర్జించడం 4:7

దైవభక్తి అభ్యాసం 4:7-8

మంచి ఆదర్శంగా ఉండడం 4:12

ఆధ్యాత్మిక వరాలను ఉపయోగించడం 4:14

క్రైస్తవ సేవకే పూర్తిగా అర్పితం 4:15-16

ఇతరులతో ప్రవర్తన విషయంలో ఆదేశాలు 5:1-3

విధవరాండ్రను గురించిన ఆదేశాలు 5:4-16

పెద్దలకు ఆదేశాలు 5:17-20

తిమోతికి ఆదేశాలు 5:21-25

దాసులకు ఆదేశాలు 6:1-2

తప్పుడు బోధకులు 6:3-5

గర్విష్ఠి, పొగరుబోతు 6:4

పనికిరాని విషయాలలో ఆసక్తి 6:4

జగడాలు కలుగుతాయి 6:5

క్రీస్తు సత్యం లేని స్థితి 6:5

డబ్బును సంపాదించడానికి మతాన్ని ఉపయోగించుకోవడం 6:5

ఉన్నదానితో తృప్తి 6:6-8

ధనాన్ని ఆశించడంలోని ప్రమాదం 6:9-10

విశ్వాసులు పాటుపడవలసిన విషయం 6:11

ఆధ్యాత్మికమైన పోరాటానికి కావలసిన ఉత్సాహం 6:12-14

శాశ్వతుడైన గొప్ప దేవుడు తగిన సమయంలో క్రీస్తును తీసుకువస్తాడు 6:15-16

ధనికులకు ఆజ్ఞలు 6:17-19

తిమోతికి చివరి మాటలు 6:20-21

No comments:

Post a Comment