Breaking

Friday, 14 January 2022

inthalone kanabadi – anthalone maayamayye ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే


 



ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే

అల్పమైన దానికా ఆరాటం

త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి

స్వల్పమైనదానికా పోరాటం

కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం

దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే||


1.బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా

అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)

నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా

చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||


2.మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో

ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)

ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున

చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||







No comments:

Post a Comment