రచయిత:
దానియేలు. కొందరు ఆధునిక బైబిలు వ్యాఖ్యాతలు దానియేలే ఈ గ్రంథాన్ని వ్రాశాడని ఒప్పడం లేదు. 8:1, 15, 27; 9:2-4, 20; 10:2, 7; 12:5, 8 చూడండి. ఈ వాక్యాలు దానియేలే ఈ పుస్తకాన్ని వ్రాసినట్లు సూచిస్తున్నాయి. మత్తయి 24:15లో ఉన్న భవిష్యద్వాక్కు (దాని 9:27; 11:31; 12:11 చూడండి). “అసహ్యమైన వినాశకారి అతి పవిత్ర స్థలంలో నిలుచుండడం” దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికినదే అన్నాడు యేసుప్రభువు. క్రీస్తులోని విశ్వాసులకు ఈ సాక్ష్యం చాలు.
వ్రాసిన కాలం:
క్రీ.పూ. 539లో బబులోనును మాదీయవారూ పారసీకులూ వశపరచుకొన్నారు. దానికి కొద్ది కాలం తరువాత దానియేలు ఈ పుస్తకాన్ని వ్రాసి ఉంటాడు.
ముఖ్యాంశాలు:
ఈ లేఖనంలో రెండు ముఖ్యాంశాలు కనిపిస్తున్నాయి. ఒక వైపు దానియేలు అతని సహచరులు అనుభవించిన విషయాలు. మరోవైపు మనకోసం దానియేలు వ్రాసి ఉంచిన భవిష్యసూచక దర్శనాలు. ఈ రెండు ముఖ్యాంశాలలో సర్వాధికారి అయిన దేవుడు తన ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడు. ఈ భవిష్యసూచక దర్శనాలలో రాజ్యాలు పైకి రావడం కూలిపోవడం గురించి, ప్రపంచ పాలన చేసే చక్రాధిపత్యం, ఈ యుగం చివరి రోజులు, రానున్న క్రీస్తువిరోధి, చివరికి క్రీస్తు తన శాశ్వత రాజ్యం నెలకొల్పడం గురించి చూస్తున్నాం.
విషయసూచిక:
దానియేలు, హీబ్రూ యువకుల తర్బీదు 1:1-7
దానియేలు చేసిన ఉత్తమ తీర్మానం 1:8
ఫలితం 1:15
దేవుని కృప 1:17,20
నెబుకద్‌నెజరురాజు కన్న కలలు 2:1-49
కల 2:1-3
బబులోను జ్ఞానులు విఫలం 2:4-13
దానియేలు విన్నపం, ప్రార్థన, కృతజ్ఞత 2:14-23
దానియేలు చెప్పిన కలల అర్థం 2:26-45
ఫలితం 2:46-49
నెబుకద్‌నెజరు ఒక ప్రతిమను చేయించడం 3:1-30
రాజాజ్ఞ 3:4-6
షద్రకు అతని సహచరులు లోబడడానికి తిరస్కరించడం 3:8-18
రాజాగ్రహం 3:19-23
అగ్నిగుండంలో దేవుడిచ్చిన భద్రత 3:24-27
ఫలితం 3:28-30
నెబుకద్‌నెజరు ఒక చెట్టు గురించి కన్న కల 4:1-37
కల 4:1-8
దానియేలు చెప్పిన భావం 4:19-27
కల నెరవేర్పు 4:28-37
బెల్‌షస్సరు విందు, గోడమీద వ్రాత 5:1-30
విందు 5:1-4
వ్రాత 5:5-6
బబులోను జ్ఞానుల విఫలం 5:7-9
రాణి సలహా 5:10-12
దానియేలుకు రాజు మాటలు 5:13-16
రాజుకు దానియేలు మాటలు 5:17-24
దానియేలు వ్రాతను గురించి వివరించడం 5:25-28
నెరవేర్పు 5:30
సింహాల బోనులో దానియేలు 6:1-26
దానియేలు శత్రువుల కుట్ర 6:1-9
దానియేలు నమ్మకంగా ప్రార్థించడం 6:10-11
శిక్ష 6:12-18
దానియేలును దేవుడు కాపాడడం 6:19-24
ఫలితం 6:25-28
నాలుగు గొప్ప జంతువుల గురించి దానియేలుకు వచ్చిన కల 7:1-28
కల 7:1-14
కలకు భావం 7:15-28
పొట్టేలు, మేకపోతు గురించి దానియేలు చూచిన దర్శనం 8:1-27
దర్శనం భావం 8:1-14,15-27
దానియేలు దేవుని వాక్కును అర్థం చేసుకోవడం, అతడు చేసిన గొప్ప ప్రార్థన 9:1-19
గబ్రియేలుదూత డెబ్భయి వారాల గురించి చెప్పడం 9:20-27
దానియేలు చూచిన మరో దర్శనం 10:1—12:13
దర్శనం 10:1-10
సందేశం 10:11—12:4
అదృశ్య లోకంలో పోరాటం 10:12-14,20,21
దానియేలు శక్తినొందడం 10:15-19
అధికారాన్ని చేపట్టాలని కొందరు అధిపతుల మధ్య పోరాటాలు 11:1-35
యుగాంతంలో రాజులు 11:36-45
మహా బాధ కాలం 12:1
విడుదల, పునరుత్థానం, ప్రతిఫలం 12:2-4
దర్శనం, సందేశం, ముగింపు 12:1-13
No comments:
Post a Comment