ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా
1. నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ..
(హల్లెలూయ..)
2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలికలోనే నివసించు చున్నావు
నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ క్రుపలో ..
(హల్లెలూయ..)
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు
నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు ..
(హల్లెలూయ..)
4.నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
5.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
No comments:
Post a Comment