Breaking

Sunday, 23 January 2022

మీకా (పరిచయం)

 




రచయిత:


మీకా గాతు నగరం సమీపాన ఉన్న మోరెషతు గ్రామస్థుడు (1:14), సామాజిక నీతిన్యాయాల విషయం ఆసక్తి ఉన్న ప్రవక్త, పేదల పక్షంగా నిలిచిన వ్యక్తి. “మీకా” “మీకాయా” అనే పేరు సంక్షేపరూపం. “మీకాయా” అంటే “యెహోవావంటి వాడెవడు?” యిర్మీయా 26:18 లో మీకా ప్రస్తావన ఉంది.


వ్రాసిన కాలం:


సుమారు క్రీ.పూ. 700.


ముఖ్యాంశం:

ప్రజల దుష్టత్వం. దేవుని తీర్పు. రాబోయే దేవుని రాజ్యం. నిజమైన భక్తి ఒక వ్యక్తి జీవిత విధానంలో పవిత్రతనూ, న్యాయనిరతినీ కలిగిస్తుంది. ఈ పుస్తకంలో యేసుక్రీస్తును గురించిన భవిష్యద్వాక్కులున్నాయి. ఆయన జన్మ స్థలాన్ని గురించి 700 సంవత్సరాల క్రితమే ఇందులో రాసి ఉంది (5:2). ఆయన రాజ్య పరిపాలన వివరాలున్నాయి (4:1-8).


విషయసూచిక:


ప్రవక్త, అతడికి కలిగిన దర్శనం 1:1-2

దేవుడు ఇస్రాయేల్‌పై తీర్పుకు బయలుదేరాడు 1:2-5

విగ్రహ పూజను అణచివేస్తాడు 1:5-7

రానున్న అష్షూరు దాడిని గురించిన విలాపం 1:8-16

దేవుని తీర్పుకు కారణాలు 2:1-11

ధనికులు పేదల్ని దోచుకుంటున్నారు 2:1-5

కపట ప్రవక్తలు బయలుదేరారు 2:6-11

ఇస్రాయేల్‌కు కలగబోయే క్షేమ స్ధితి 2:12-13

నాయకులకు, ప్రవక్తలకు హెచ్చరికలు 3:1-4

నిజ ప్రవక్తలకు, కపట ప్రవక్తలకు ఉన్న తేడా 3:5-8

దుర్మార్గులకు సంపూర్ణ నాశనం 3:9-12

దేవుని రాజ్యం లోకాన్ని జయిస్తుంది 4:1-8

బాధ, ప్రవాసం పోయి, శాంతి, క్షేమం కలుగుతాయి 4:9-13

రానున్న విజేత బేత్‌లెహేంలో జన్మిస్తాడు 5:1-5

విగ్రహ పూజనుండి విముక్తి పొందిన ఇస్రాయేల్‌

తన శత్రువులను జయిస్తుంది 5:7-15

దేవుని అనుగ్రహాన్ని గుర్తించి దాని ప్రకారం ప్రవర్తించవలసిందని

ఇస్రాయేల్‌కు పిలుపు 6:1-5

“న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం” 6:6-13

రాజీపడడంవల్ల మేలు చేకూరదు 6:14-16

తన ప్రజల చెడుతనం గురించి ప్రవక్త విలాపం 7:1-6

ప్రవక్త తన ప్రజలకు ధైర్యం చెప్పడం 7:7

దేవుని ప్రజలు క్షేమంగా ఉంటారు 7:8-13

దేవుడు ఇస్రాయేల్ పాపాలను క్షమించి, వాటిని మర్చిపోతాడు 7:14-20



No comments:

Post a Comment