నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు
ఆరాధనకు యోగ్యుడు ఆది అంతము లేనివాడు "2"
సాటి లేని ప్రేమ తనది నా ఊహాలకందనిది
ఘనత మహిమా చెల్లించెదను స్తుతులు స్తోత్రం నేను
అర్పించెదను "నేను నమ్మిన "
1. ఆకాశం పట్టజాలనీ ఆకారముతో దేవుడు
కోటి సూర్య కాంతులైనా సాటి రాని తేజోమయుడు"2"
వెలుగునే వస్త్రముగా ధరియించిన దేవుడు నలిగిన
హృదయాలకు ఆయనే ఆశ్రయుడు
నేను నమ్మిన దేవుడు ప్రేమాస్వరూపుడు"2" "ఘనత"
2. బుద్ధి జ్ఞానములను కలిగినా సంపన్నుడు యేసు ప్రభువు
ఈలోకపు సంపదులేవి తన ప్రేమకు సాటిరావు"2"
మన కొరకే పుట్టెను గనుక తన కొరకు ఒక ఇల్లు లేదు
మనలను ప్రేమించెను గనుక తల్లి ప్రేమ పొందలేదు
నేను నమ్మిన దేవుడు లోకాశలు లేనివాడు"2" "ఘనత"
3. ప్రభుని నమ్ముకున్న వారు ధరణిలోన ధన్యులు
మరణము లోనుండి వారు జీవానికి దాటెదరు"2"
దేవునికై బ్రతికిన నీవు మట్టి లోకి చేరెనగాని మట్టి నుండి
మహిమకు నిన్ను యేసు ఒచ్చి కొనిపోవును
నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పడు "2" "ఘనత"
No comments:
Post a Comment