Breaking

Saturday, 8 January 2022

యెషయా (పరిచయం)

 




రచయిత:

యెషయా ప్రవక్త. అతని ఈ హీబ్రూ పేరుకు అర్థం “యెహోవాయే రక్షణ” లేక “యెహోవా రక్షిస్తాడు”. యెషయా మంచి పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. అతడు బాగా చదువుకున్న వాడని కనిపిస్తుంది. అతడు జెరుసలంలోనో లేక చుట్టుప్రక్కలలోనో జీవించి ఉండాలి (6:4; 37:2; 38:4). అతడొక ప్రవక్తిని పెండ్లాడాడు. వారికిద్దరు కొడుకులు (7:3; 8:3). యూదుల పారంపర్యాన్ని బట్టి మనష్షే కాలంలో అతణ్ణి రంపంతో రెండు ముక్కలుగా ఖండించడం జరిగింది. కొందరు ఆధునిక వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతున్నట్టుగా ఈ పుస్తకాన్ని ఈ ఒక్క యెషయా రాయలేదు, గాని ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు వేరు వేరు సమయాల్లో రాశారు. ఇలా అనుకోవడానికి సాక్ష్యాధారాలు లేవు.

వ్రాసిన కాలం:

రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలాల్లో యెషయా ప్రవక్తగా సేవ చేసాడు (1:1). అది క్రీ.పూ 740-700 మధ్య జరిగింది. అతడు 37,38 అధ్యాయాలలో జరిగిన సంగతులను గురించి చెబుతున్నాడు గనుక అతడు క్రీ.పూ 681 వరకు జీవించి ఉండాలి.

ముఖ్యాంశాలు:

మనుషుల దుర్మార్గం మీద దేవుని తీర్పు, విశ్వాసంతో ఆయనవైపు తిరిగిన వారిమీద ఆయన కృప, దేవుడిచ్చిన రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా దొరుకుతుంది. పాత ఒడంబడికలోని మిగత ప్రవక్తలందరికంటే యెషయా యేసుక్రీస్తును గురించి ఎక్కువ స్పష్టమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ఆయన పుట్టుక, బాధలు, మరణం, ఆయన ఇక ముందు జరిగించబోయే మహిమగల పరిపాలన. దిగజారిన ఇస్రాయేల్‌తో ఆరంభించి (1:2-17) క్రమేణ అవినీతికి తావు లేని నూతన భూమి పరలోకం గురించి వివరిస్తూ వచ్చాడు. (65:17; 66:22-24). ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు, వచనాలు: 1:18; 2:1-5; 6:1-8; 7:14; 9:6-7; 11:1-9; 25:4-9; 32:1-5; 35:1-10; 40:1-31; 41:17-20; 43:1-2, 25; 45:22-25; 49:6; 52:13-15; 53:1-12; 55:1-13; 57:15; 61:1-3; 64:1-12; 65:17; 66:2.

విషయసూచిక

దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు 1:2-10

వారి దొంగ మత భక్తిని దేవుడు తిరస్కరించాడు 1:11-17

దేవుడిచ్చిన ఆహ్వానం, వాగ్దానం, హెచ్చరిక 1:18-20

జెరుసలం పై దేవుని తీర్పు, ఒక క్రొత్త దినం గురించి ఆయనిచ్చిన వాగ్దానం 1:21-31

రానున్న దేవుని రాజ్యం 2:1-5

ప్రభువు దినం 2:6-22

యూదా, జెరుసలం పై తీర్పు 3:1—4:1

ప్రభువు కొమ్మ 4:2-6

దుష్టమైన ద్రాక్షతోట 5:1-7

బాధ తప్పదు 5:8-30

దేవుడు యెషయాను పిలిచి, పవిత్రపరచి, ముందుకు పంపించాడు 6:1-13

ఆహాజు రాజు 7:1-12

కన్యక కుమారుడు 7:14

యూదులను శిక్షించడానికి దేవుడు అష్షూరు రాజ్యాన్ని వాడడం 7:18—8:10

రానున్న రక్షకుడైన యేసుక్రీస్తును గురించి దేవుని మూలంగా వచ్చిన మాటలు –

“మనకు శిశువు కలిగాడు” 9:1-7

సర్వశక్తుడైన దేవుని కోపం 9:8—10:4

అష్షూరుపై దేవుని శిక్ష 10:5-34

యెష్షయి మొద్దునుండి చిగురు, క్రీస్తు భవిష్యత్ రాజ్యం 11:1-16

స్తుతి గీతం 12:1-6

ఇతర దేశాలగురించి దేవుని నుంచి వచ్చిన మాటలు 13:1—24:22

బబులోను గురించి 13:1—14:23

“వేకువ చుక్క” (లూసీఫర్‌) పడిపోవడం 14:12-15

అష్షూరు గురించి 14:24-27

ఫిలిష్తీయుల గురించి 14:28-32

మోయాబు గురించి 15:1—16:14

దమస్కు గురించి 17:1-14

నదులకు ఆవలనున్న ప్రాంతాల గురించి, ఇతియోపియా (కూషు) గురించి 18:1-7

ఈజిప్ట్ గురించి 19:1-25

ఈజిప్ట్, కూషు గురించి 20:1-6

బబులోను గురించి 21:1-10

ఎదోము గురించి 21:11-12

అరేబియా గురించి 21:13-17

జెరుసలం గురించి 22:1-18

తూరు గురించి 23:1-18

లోక ప్రజ గురించి 24:1-22

యెహోవాదేవుడు జెరుసలంలో పరిపాలన చేస్తాడు 24:23

యెహోవాదేవునికి స్తుతి పలుకులు 25:1-12

యూదాలో పాడవలసిన పాట 26:1-21

దేవుడు ఇస్రాయేల్‌ను విమోచిస్తాడు 27:1-13

ఇస్రాయేల్‌లో త్రాగుబోతులు, పరిహాసకులు 28:1-29

అమూల్యమైన మూలరాయి 28:16

జెరుసలంకు చేటు 29:1-16

హెచ్చరికల మధ్య వాగ్దానాలు 29:17-24

మూర్ఖ జనానికి (ఇస్రాయేల్‌కు) చేటు 30:1-17

మరికొన్ని దీవెనలకు సంబంధించిన వాగ్దానాలు 30:18-26

దేవుడు కోపంతో వస్తాడు 30:27-33

దేవుని మీద కాక మనుషుల మీద ఆధారపడిన వారికి బాధ 31:1-3

దేవుడు జెరుసలంను కాపాడతాడు 31:4-9

నీతిగల క్రీస్తు రాజ్యం 32:1-20

మనుషులనుండి కష్టాలు, పై నుండి సహాయం 33:1-24

భక్తిహీనమైన దుర్మార్గమైన ఇహలోక శక్తులను దేవుడు నాశనం చేస్తాడు 34:1-17

దేవుడు విమోచించిన వారికి ముందు దొరికే దివ్య స్థితి 35:1-10

సన్‌హెరీబు చేతులలో నుండి జెరుసలంను దేవుడు రక్షించాడు 36:1—37:38

హిజ్కియా ప్రార్థన 37:14-20

సన్‌హెరీబు గురించి యెషయా దేవుని మూలంగా పలికినది 37:21-35

సన్‌హెరీబు సైన్యాలు అద్భుత రీతిలో నాశనమయింది 37:36-37

హిజ్కియాకు జబ్బు చేయడం, ఆరోగ్యం చేకూరడం 38:1-22

హిజ్కియా వ్రాత 38:9-20

బబులోను నుండి రాజదూతలు రావడం,

హిజ్కియా అహంకారం 39:1-2

హిజ్కియాను యెషయా మందలించి, దేవుని తీర్పును ప్రకటించాడు 39:3-8

యెహోవాదేవుడు తన ప్రజలను ఆదరించేవాడు 40:1-31

ఆదరణ సందేశం – రక్షకుని గూర్చి వాగ్దానం 40:1-11

ఆదరణకు ఆధారం – దేవుని గొప్పతనం 40:12-31

ఇస్రాయేల్‌కు సహాయకుడైన దేవుడు 41:1—46:13

భూరాజ్యాలతో దేవుని వివాదం 41:1-29

దేశాలు విగ్రహాలను చేసుకొని వాటిమీద ఆధారపడడం 41:5-7

దేవుని దాసుడైన ఇస్రాయేల్ 41:8-20

భూరాజ్యాల విగ్రహాలు లేక దేవుళ్ళు భవిష్యత్తును గురించి చెప్పలేవు 41:21-29

యెహోవా సేవకులు 42:1-9

దేవునికి స్తుతి 42:10-17

ఇస్రాయేల్ ఆత్మసంబంధమైన గ్రుడ్డితనం 42:18-25

సహాయకుడు, రక్షకుడు యెహోవా దేవుడు మాత్రమే 43:1-13

నమ్మదగని ఇస్రాయేల్, దేవుని కనికరం,

“ఎడారిలో సెలయేళ్ళు” 43:14-28

దేవుడు ఇస్రాయేల్‌ను దీవిస్తాడు 44:1-5

విగ్రహాలు పనికిమాలినవని నిజ దేవుడు బయట పెడతాడు 44:6-20

ఇస్రాయేల్ విమోచన పొందాలి, జెరుసలం తిరిగి కట్టబడాలి 44:21-28

యెహోవా కోరెషును లేవనెత్తడం 45:1-14

ఏకైక దేవుడు అందరికీ ఆహ్వానమిస్తాడు 45:18-25

బబులోను విగ్రహాలు ఏమీ చేయలేవు, దేవుడు అన్నీ చేయగలడు 46:1-13

బబులోను పతనం 47:1-15

భక్తిహీనంగా, మూర్ఖంగా ఉన్న ఇస్రాయేల్‌కు సందేశం 48:1-22

యేసు యెహోవా సేవకుడు 49:1—55:13

దేవుని సంకల్పాలు 49:5-7

ఆయన ఇస్రాయేల్‌ను కాపాడతాడు 49:8-26

ఆయన విధేయత, ఇస్రాయేల్ అవిధేయత 50:1-11

ఆయనను నిందించడం, ఆయన మీద ఉమ్మివేయడం 50:6-7

ఆయన విమోచన 51:1-16

దేవుని ఉగ్రత పాత్ర 51:17-23

ఆయన జెరుసలంకు తిరిగి వస్తాడు 52:1-12

యెహోవా సేవకుని బాధలు, విజయం 52:13—53:12

ఆయన అనుభవించిన బాధల ఫలితంగా ఇస్రాయేల్‌కు గొప్ప దీవెన 54:1-17

యేసు బాధల ఆధారంగా ఆహ్వానం 55:1-7

మానవుని మార్గాలకంటే దేవుని మార్గాలు మహోన్నతమైనవి 55:8-13

ఇస్రాయేల్ దీవెనలలో ఇస్రాయేల్ ప్రజలు కానివారు పాలుపొందుతారు 56:1-8

ఇస్రాయేల్ దుష్ట పాలకుల ఖండన 56:9—57:13

సాత్వికులకు ఆదరణ 57:14-21

యథార్థమైన ఆరాధనకు, అబద్ధమైన దానికి మధ్యగల వ్యత్యాసం 58:1-14

ఇస్రాయేల్ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడినప్పుడు

దేవుడిచ్చే విమోచన అందుబాటులో ఉంటుంది 59:1-21

ఇస్రాయేల్‌కు శాంతి సమాధానాలు, సంపదలు 60:1-22

యేసు ఆత్మతో నిండిన యెహోవా సేవకుడు,

ఆయనద్వారానే ఘనమైన దేవుని రాజ్యం వస్తుంది 61:1-11

జెరుసలం నిర్మాణం, ఘనస్థితికి రావడం 62:1-12

ప్రతీకార దినం, విమోచన దినం 63:1-6

దేవుని ప్రజల స్తుతి, ప్రార్థన 63:7—64:12

దేవుని జవాబు 65:1—66:24

ఆయన ఇతర ప్రజల గురించి చెప్పాడు 65:1

ఇస్రాయేల్ మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని,

దొంగ భక్తిని ఆయన ఖండించాడు 65:2-5

ఆయన పగతీర్చుకుంటాడు గాని తన నిమిత్తం ఇస్రాయేల్‌లో

కొందరిని ఉంచుకుంటాడు 65:6-16

ఆయన నూతన భూమినీ ఆకాశాన్నీ సృష్టిస్తాడు 65:17-25

ఆయన సాత్వికులను సన్మానిస్తాడు 66:1-2

ఆయన ఇస్రాయేల్‌ను రక్షిస్తాడు గాని పశ్చాత్తాపపడని

పాపుల పై తప్పక తీర్పును అమలు చేస్తాడు 66:3-24

No comments:

Post a Comment