Breaking

Monday, 10 January 2022

aaradinthu aaradinthu yesayya ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం






ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం

అన్నింట ఘన నామం (2)

స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును

క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)

వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)

యేసునందే సత్యం  యేసులోనే మార్గం 

యేసే నా నిత్యజీవము (2)


1.ప్రభు నామము ఎంతో ఘనమైనది

అన్ని నామములకంటె హెచ్చైనది (2)

ఆ నామమందే రక్షణ సోదరా (2)

యేసయ్య రక్తము చిందించెగా (2)

యేసే నా రక్షణ  యేసే విమోచన 

యేసే నా నిరీక్షణా (2)


2.ప్రభు నామము ఎంతో బలమైనది

అపవాది క్రియ లయపరుచునది (2)

భయమేల నీకు ఓ సోదరా (2)

సాతాను సిలువలో ఓడిపోయెగా (2)

యేసే రక్తమే జయం  యేసు నామమే జయం 

యేసునందే విజయం (2)


 







No comments:

Post a Comment