పాపాన్ని జయించాలి పరిశుద్ధముగా జీవించాలి అని ప్రతీ క్రైస్తవుడు ఆశిస్తాడు. కానీ చేసిన పాపాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ పాపం తెచ్చే పరియవసనాన్ని భరిస్తూ సతమతమౌతూ ఉంటాడు. పాపం మనిషిని దేవుని దూరం చేస్తుంది. నరకానికి చేరువచేస్తుంది. హృదయములో సమాధానన్ని దొంగిలిస్తుంది. సమాజములో సాక్ష్యాన్ని పాడుచేస్తుంది అయితే ఇంత నష్టాన్ని కల్గించే పాపాన్ని మనము ఎలా జయించాలి పరిశుద్ధముగా ఎలా జీవించాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మొదటగా మనము పాపాన్ని మన సొంత శక్తితో జయించడానికి ప్రయత్నించకూడదు
మన సొంత శక్తితోమనము పాపాన్ని జయించలేము
పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.అని
ప్రియులారా
మనల్ని ప్రేమించే దేవుని సహాయముతో మనము అన్నింటిలో విజయాన్ని సాధించగలం
అయితే దేవుని సహాయం మనకు ఎలా దొరుకుతుంది
పాపాన్ని జయించడానికి దేవుడు చెప్తున్న మార్గాలేంటి అనేది ఈ ఇప్పుడు చూద్దాం
మొదటగా అన్నింటిలో మనకు మాదిరి యేసుక్రీస్తే
యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు కాబట్టి మనము కూడా జయించగలము
యేసయ్య ఈ విధంగా అంటున్నాడు
నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.అని
ప్రియులారా
దేవుని సింహాసనం శాశ్వతమైనది మనము జయించే వారముగా ఉన్నట్లయితే ఆయనతో పాటు శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని ఇస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానమిస్తున్నాడు
కాబట్టి ఈ లోకములో మనము జయ జీవితాన్ని జీవించుటకు ప్రయత్నిస్తూ దేవునితో శాశ్వత కాలం ఉండే భాగ్యాన్ని పొందుకుందాం
రెండవదిగా యేసుక్రీస్తు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు
నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్ధించాడు. మనము కూడా యేసుక్రీస్తువలె తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొనవలసిన వారమై యున్నాము
మన ఇష్టం మన చిత్తం మనకు కష్టాల్ని నష్టాల్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే మన ఇష్టాన్ని సిలువవేసి తండ్రి చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుంటామో అప్పుడే మనము ఈ లోకములో జయ జీవితాన్ని జీవించగలం
మూడవదిగ యేసుక్రీస్తు జీవితాన్ని మరింత పరిశీలనగా చూస్తే ఆయనలో మరొక అద్భుతమైన లక్షణం మనకు కనిపిస్తుంది అదేంటంటే తగ్గింపు తత్వం
ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2: 6 వ వచనం లో ఈ విధంగా వ్రాయబడి ఉంది
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.అని
ప్రియులారా
తగ్గింపు తత్వం మనలో లేక పోతే తండ్రి చిత్తం నెరవేర్చడం గాని ఈ లోకములో జయ జీవితాన్ని జీవించడం గాని సాధ్యం కాదు
యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా దాసుని స్వరూపమును ధరించుకొన్నాడు
మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొన్నాడు
మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని అన్ని విషయాలలో దేవునికి విధేయత చూపడం నేర్చుకొనవలసిన వలసిన వారమై యున్నాము
యేసుక్రీస్తులో కనిపించే మరొక అద్భుత మైన లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్ధన
ప్రియులారా యేసుక్రీస్తు శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.అని వ్రాయబడి ఉంది
యేసుక్రీస్తు దేవుని కుమారుడై యుండి కూడా ఈ లోకములో శరీర దారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతోను మహా రోదనముతోను తండ్రికి ప్రార్ధించవలసి వచ్చింది
మరి బలహీనతలతో నుండి ఉన్న మనము ఇంకెంతగా
కన్నీళ్లతో రోదనముతో ప్రార్ధించవలసిన అవసరత ఉందో గమనించండి
కన్నీటి ప్రార్ధనకు గొప్ప శక్తి ఉంది భూమి పై మనము కార్చే కన్నీరు పరలోకములో ఉన్న దేవుని గుండెను కదిలించగలదు. దేవదూతల సమూహాన్ని సైతం ఈ భూమి పైకి దించగలదు కాబట్టి మనము కన్నీటితో
ప్రార్ధిస్తూ పాపమనే ప్రతీ కాడి నుండి విడుదల పొందుకుందాం
ఐదవదిగా మనము పాపాన్ని జయించడానికి మనకు కావాల్సింది పరిశుద్దాత్మ దేవుని సహాయం
యేసుక్రీస్తు ఈ విధంగా అన్నాడు
నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.అని
ప్రియులారా
పరిశుద్దాత్మ దేవుడు మనలో ఉన్నట్లైతే పాపానికి మనలో చోటు ఉండదు
పరిశుద్దాత్మ దేవుడు అనగా సత్యస్వరూపియగు ఆత్మ ఆయన మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తు
ఉంటాడు ఈ ఆత్మ కలిగిణ వారమై ఈ ఆత్మ నింపుదల కలిగిన వారమై ఉండుటకు మనము ప్రతీ దినం
ప్రార్ధించవలసిన వారమై యున్నాము
అరవదిగ పాపాన్ని జయించుటకు మనము కలిగి ఉండవల్సింది వాక్యము అనే ఆత్మ ఖడ్గం
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4: 12 వ వచనంలో
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.అని వ్రాయబడి ఉంది
ప్రియులారా
దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే అపవాది తెచ్చే ప్రతీ శోధనను మనము జయించగలం
దేవుని వాక్యమే మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై యున్నది
దావీదు భక్తుడు ఈ విధంగా అన్నాడు
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను
అని
ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రతీ దినం ధ్యానిస్తూ
వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటూ
వాక్యము అనే ఆత్మ ఖడ్గంముతో అపవాది తెచ్చే ప్రతీ శోధనను జయించు వారమై యుంధాం
చివరగా పాపాన్ని జయించుటకు మనము చేయవలసింది ఏంటంటే శ్రమలను ఓపికతో సహించాలి
పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయం మొదటి వచనం లో ఈ విధంగా వ్రాయబడి ఉంది
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి
శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.అని
ప్రియులారా
శ్రమలు మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తాయి
కొన్ని సార్లు దేవుడు విశ్వాసుల్ని శ్రమలు అనే కొలిమిలో పడేస్తాడు. ఈ కొలిమిలో పడి మనము నశించాలని దేవుని ఉద్దేశం ఏమాత్రం కాదు గాని
శ్రమలు అనే ఈ కొలిమిలో మనముపుటము వేయబడి బంగారముల మెరవడానికే అని గ్రహించాలి
కాబట్టి మన జీవితంలో దేవుడు అనుమతించిన
ప్రతీ శ్రమను ఓపికతో సహిస్తూ దేవుని పోలికలో మారుటకు ప్రయత్నిద్దాం
పాపాన్ని జయించుటకు ఉన్న ఈ ఏడు మార్గాల్ని అవలంబిస్తూ యేసుక్రీస్తులో ఉన్న ఈ లక్షణాలు కలిగి ఉంటు ఈ లోకములో జయ జీవితాన్ని జీవిస్తూ పరలోకములో ప్రభుతో ఉండే గొప్ప భాగ్యాన్ని మనలో ప్రతీ ఒక్కరము పొందుకుందాం
అట్టి కృప అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయ చేయును గాక. ఆమెన్
No comments:
Post a Comment