Breaking

Saturday, 8 January 2022

aarambhamayyindi restorationఆరంభమయ్యింది రెస్టోరేషన్

 


ఆరంభమయ్యింది రెస్టోరేషన్

నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)

నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం

నా ప్రభువు సమకూర్చి దీవించులే

మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు

ఇకముందు నా చేత చేయించులే

మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్

కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్

రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు

నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి

మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్

కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది||



1.మేం శ్రమనొందిన దినముల కొలది

ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును

మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు

తన బుడ్డిలోన దాచుంచెను

సాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగును

తోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగును

దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించును

కీడు తొలగజేయును – మేలు కలుగజేయును ||రెండంతలు||

మా పంట పొలముపై దందా యాత్ర చేసిన

ఆ ముడతలను ప్రభువాపును

చీడ పురుగులెన్నియో తిని పారువేసిన

మా పంట మరలా మాకిచ్చును

నా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెను

అది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చును

క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపును

క్రొత్త తైలమిచ్చ్చును – మా కొరత తీర్చును ||రెండంతలు||


2.పక్షి రాజు వలెను మా యవ్వనమును

ప్రభు నిత్య నూతనం చేయును

మేం కోల్పోయిన యవ్వన దినములను

మరలా రెట్టింపుగా మాకిచ్చును

అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చును

జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును

సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చును

ఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును ||రెండంతలు||


3.మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన

మా సొత్తు మాకు విడిపించును

మోసకారి మోసము మేము తిప్పి కొట్టను

ఆత్మ జ్ఞానముతో మేము నింపును

అరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతో

మమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగును

దొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచును

మహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు||


4.మా జీవితాలలో దైవ చిత్తమంతయు

మేము చేయునట్లు కృపనిచ్చును

సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను

గొప్ప ద్వారములు ప్రభు తెరచును

అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చును

ఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చును

మహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చును

సత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||

No comments:

Post a Comment