గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా
గూడు చెదరిన పక్షుల చేరదీసే నాధుడా
త్యాగశీలుడా నీకు వందనాలయ
నా హృదయ పాలక స్తోత్రం యేసయ్య (2)
1.లోకమానే అరణ్య యాత్ర భారమాయేను
బహు ఘోరమాయేను
నా గుండె నిండ వెదనలే నిండియుండెను నింధించుచుండెను
కన్నీరే నాకు అన్న పానమాయేను "2"
ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను
బహు ఘోరమయేను " గుండె “
2.మనిషి మనిషి నుర్వలేని మాయా లోకము శూన్య ఛాయాలోకము
మాటలతో గాయ పరిచే క్రూర లోకము అంధకార లోకము
ఒంటరి తనమే నాకు స్నేహమయేను "2"
ధీక్కు లేక నా బ్రతుకు ధురమాయేను-బహు ఘోరమయేను“గుండె”
3.కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి
కన్నీరు కేరటమై యెధలో పొంగుచున్నది పొరలి సంద్రమైనధి
శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
పానర్పణముగా నేను పోయబడితిని-సీలువ సాక్షినైతిని " గుండె"
No comments:
Post a Comment