Breaking

Thursday, 13 January 2022

యెహెజ్కేలు (పరిచయం)






రచయిత:

యెహెజ్కేలు “దేవుడు బలపరుస్తాడు” అని అర్థం. యెహెజ్కేలు యాజుల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి. క్రీ.పూ.597లో నెబుకద్‌నెజరు అనేక మందితో కూడా యెహెజ్కేలును చెరపట్టుకుపోయాడు.

వ్రాసిన కాలం:

క్రీ.పూ. 593లో ప్రవక్తగా ఉండడానికి దేవుడు యెహెజ్కేలును పిలిచాడు (అప్పుడు యెహెజ్కేలుకు 30 సంవత్సరాల వయస్సు). పుస్తకంలో జరిగిన సంఘటనల కాలావధి 22 సంవత్సరాలు. అతడు అయితే ఆ సంవత్సరాలలోనే ఈ పుస్తకం వ్రాసి ఉండాలి లేదా కొద్దికాలం తరువాతనైనా వ్రాసి ఉండాలి.

ముఖ్యాంశం:

దేవుని శోభ. దైవదర్శనాలలో ఆయన శోభా ప్రకాశం యూదుల దేవాలయం నుంచి వెళ్ళిపోవడం, క్రొత్త కాలంలో క్రొత్త దేవాలయానికి తిరిగి రావడం చూచి వివరించాడు ఈ ప్రవక్త. ఈ రెండు సంఘటనల మధ్య ఇస్రాయేల్ ప్రజల అసహ్యకార్యాలు, వారికీ ఇతర జనాలకూ దేవుడు తీర్చిన తీర్పులు, యుగాంతంలో ఇస్రాయేల్ ప్రజలకు కలగబోయే మార్పు, ఉత్తర దిక్కునుంచి దండెత్తి వచ్చే సైన్యాల నాశనం ఇందులో కనిపిస్తున్నవి. ఈ లోకానికి సర్వాధికారి యెహోవాయేనని ఈ పుస్తకమంతటా చూస్తాం. దేవుడు తన కార్యాల ద్వారా మనుషులు తనను తెలుసుకొనేలా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతుంది. “నేనే యెహోవానని తెలుసుకొంటారు” అనే మాటలు ఎన్నోసార్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. సాధారణంగా మనం చూచే మరికొన్ని మాటలు – “యెహోవా నుంచి వాక్కు వచ్చింది.” యెహెజ్కేలు ప్రకటించిన సందేశం అతని ఊహనుండి పుట్టినది కాదు. అది నేరుగా దేవుడతనికిచ్చినదే. 2 పేతురు 1:20-21 చూడండి.

విషయసూచిక:

యెహెజ్కేలును గురించి ఒక మాట 1:1-3

దర్శనంలో యెహెజ్కేలు చూచిన దేవుని మహిమాప్రకాశం 1:4-28

జీవంతో ఉన్న నాలుగు జీవులు, ఒక రథం 1:4-14

చక్రాలలో చక్రాలు 1:15-21

దేవుని వైభవం 1:22-28

దేవుడు యెహెజ్కేలును పిలవడం 2:1-10

విలాపంతోగల చుట్టిన పత్రం 2:9-10

దేవుని తరఫున యెహెజ్కేలు మాట్లాడాలి 3:1-15

కావలివాడిగా యెహెజ్కేలు 3:16-21

దేవుడు యెహెజ్కేలు నోటిని మూసివేయడం, తెరవడం 3:22-27

అలంకార రూపంలో యెహెజ్కేలు చర్యలు జెరుసలం ముట్టడిని సూచించాయి 4:1—5:4

జెరుసలంను గురించి దేవుని మాటలు 5:5-17

ఇస్రాయేల్ మీద తీర్పుకు కారణం విగ్రహారాధన 6:1-14

దుర్మార్గానికి శిక్ష – ఖడ్గం, రోగం, కరవు, శత్రువులు 7:1-27

యెహెజ్కేలును దర్శనంలో జెరుసలంకు తీసుకు వెళ్ళడం 8:1-3

దేవాలయంలో విగ్రహారాధన, చెడుతనం 8:4-18

జెరుసలంలోని దుష్టుల వధ 9:1-11

దేవాలయాన్ని, పట్టణాన్ని దేవుని శోభాప్రకాశం విడిచి వెళ్ళడం 10:1—11:25

నాయకుల గురించి భవిష్యత్ వాక్కు 11:1-13

దేవుడు ఇస్రాయేల్‌ను చెదరగొట్టి మళ్ళీ చేరదీస్తాడు 11:14-21

యెహెజ్కేలు చర్యలు యూదులు చెరను సూచించడం 12:1-28

అబద్ధ ప్రవక్తలు, ప్రవక్తిల ఖండన 13:1-23

హృదయంలో విగ్రహాలు 14:1-11

తప్పించుకోవడానికి మార్గం లేదు 14:12-23

పండ్లులేని ద్రాక్షవల్లి 15:1-8

వ్యభిచారిణి అయిన స్త్రీ సాదృశ్యం దేవుని పట్ల జెరుసలం నమ్మకంగా ఉండకపోవడం 16:1-63

దేవుడు జెరుసలంను ఎన్నుకొన్నాడు 16:1-14

జెరుసలం వ్యభిచారిణిలాగా ప్రవర్తించింది 16:15-34

నమ్మకంగా లేకున్నందుకు శిక్ష 16:35-43

జెరుసలం, షోమ్రోను 16:44-52

దేవుడు జెరుసలంను, షోమ్రోనును పూర్వస్థితికి తెస్తాడు 16:53-63

రెండు గరుడపక్షుల ఉదాహరణ 17:1-21

ఇస్రాయేల్ క్రొత్త కొమ్మ 17:22-24

అపరాధం చేసేవాడు మరణిస్తాడు 18:1-29

ప్రతి ఒక్కరు పశ్చాత్తాప పడి రక్షణ అనుభవించాలని దేవుని కోరిక 18:30-32

ఇస్రాయేల్ రాకుమారులగురించి ఒక విలాపగీతం 19:1-14

ఇస్రాయేల్ పెద్దలు యెహెజ్కేలును దర్శించడం, దేవుడు వారికిచ్చిన సందేశం 20:1-31

కూడగట్టడానికి దేవుని వాగ్దానం 20:34-44

దక్షిణ భాగాన ఉన్న ప్రాంతం గురించి ప్రకటన 20:45-49

జెరుసలంలో పవిత్ర స్థలం గురించి ప్రకటన, సిద్ధంగా ఉన్న ఖడ్గం 21:1-32

జెరుసలం పాపాలు, రానున్న తీర్పు 22:1-31

అపనమ్మకస్తులుగా ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఉదాహరణ 23:1-49

వారి పేర్లు 23:1-4

వారి దుష్ట జీవితాలు 23:5-21

వారి శిక్ష 23:22-49

నీరు మరుగుతున్న కుండ ఉదాహరణ 24:1-14

యెహెజ్కేలు భార్య మరణం 24:15-27

వేరు వేరు దేశాల గురించి భవిష్యద్వాక్కులు 25:1—32:32

అమ్మోను 25:1-7

మోయాబు 25:8-11

ఎదోం 25:12-14

ఫిలిష్తీయ 25:15-17

తూరు 26:1—28:19

తూరు గురించి ప్రకటన 26:1-21

తూరు గురించి విలాపం 27:1-36

తూరు అధికారులకు సందేశం 28:1-10

తూరు రాజు గురించి విలాపం 28:11-19

సీదోను 28:20-26

ఈజిప్ట్ 29:1—32:32

ఈజిప్ట్ గురించి విలాపం 30:1-26

అష్షూరుతో సరిపోల్చడం 31:1-18

ఈజిప్ట్ గురించి విలాపం 32:1-32

దేవుడు యెహెజ్కేలును కావలివానిగా నియమించాడు 33:1-33

దొంగ కాపరులు 34:1-10

నిజమైన కాపరి 34:11-31

ఎదోం పతనం 35:1-15

ఇస్రాయేల్ లోని కొండల గురించి ఒక మాట 36:1-21

దేవుడు ఇస్రాయేల్‌ను చేరదీసి వారికి క్రొత్త హృదయాన్నిస్తాడు 36:22-38

“ఎముకల లోయ” 37:1-10

నూతన జీవం గురించి వాగ్దానం 37:11-14

యూదా ఇస్రాయేల్‌ల కలయిక 37:15-28

గోగు గురించి భవిష్యద్వాక్కు, వాడు ఇస్రాయేల్ మీదికి దండెత్తుతాడు 38:1-18

గోగు, అతని సైన్యాల పై విజయం 38:17—39:29

క్రొత్త దేవాలయం 40:1—44:31

యెహెజ్కేలు ఇస్రాయేల్‌లో ఉన్నట్లు దర్శనం 40:1-4

దేవాలయ ప్రాంగణం, తలుపులు 40:5-37

ప్రాంగణంలో గదులు 40:38-47

దేవాలయం 40:48—41:26

ఆవరణంలో గదులు 42:1-20

దేవుని శోభ తిరిగిరావడం 43:1-12

హోమబలికి బలిపీఠం 43:13-27

దేవునికొరకు ఒక తలుపు 44:1-3

దేవుని శోభాప్రకాశం దేవాలయాన్ని నింపడం 44:4

ఆరాధనకు అవసరమైన నియమాలు 44:5-31

లేవీవారు 44:10-14

యాజులు 44:15-31

ఇస్రాయేల్ దేశాన్ని క్రొత్తగా విభాగించడం 45:1—48:29

పవిత్ర ప్రాంతం, రాజు కోసం ఒక భాగం 45:1-8

అర్పణలు, పండుగలు, ప్రత్యేక దినాలు 45:13—46:24

దేశానికి నూతన జీవమిచ్చే నది 47:1-12

గోత్రాల ననుసరించి సరిహద్దులలో భూభాగాలు 48:1-29

నగరం ద్వారాలు, దేవుని సన్నిధి 48:30-35

No comments:

Post a Comment