Breaking

Wednesday, 12 January 2022

విలాపవాక్యాలు (పరిచయం)

 





రచయిత:

యిర్మీయా.

వ్రాసిన కాలం:

క్రీ.పూ.586 తరువాత ఎప్పుడో ఒక సమయంలో వ్రాసి ఉండాలి.

ముఖ్యాంశం:

ఇది జెరుసలం విషయం శోకపూరిత పద్యం. ఇందులో జెరుసలం నాశనం, దానికి కారణం, యిర్మీయా మనోవేదనలు, అతడు నేర్చుకొన్న ఆధ్యాత్మిక పాఠాలు, ఇస్రాయేల్ ప్రజలకోసం అతని ప్రార్థన కనిపిస్తున్నవి. విలాపం, దుఃఖం మధ్యలో కొన్ని చక్కని అర్థ సహితమైన మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి – 3:21-27.

విషయ సూచిక

జెరుసలం పతన స్థితిని ప్రవక్త వివరిస్తున్నాడు 1:1-11

వ్యక్తితో పోల్చబడిన జెరుసలం తన స్థితిని గురించి విలపిస్తుంది 1:12-22

ప్రవక్త మరోసారి మాట్లాడుతున్నాడు 2:1-22

ప్రవక్త తన విలాపాన్ని ముందుకు సాగించాడు 3:1-20

బలమైన ఆశాకిరణాలు 3:21-42

అయినా దుఃఖం ఇంకా మిగిలి ఉంది 3:43-66

జెరుసలం గత వైభవం, ప్రస్తుత విషాద పరిస్థితి 4:1-22

జెరుసలం తరఫున దేవునితో మొరపెట్టడం 5:1-22

No comments:

Post a Comment