Breaking

Sunday, 28 November 2021

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా - Brathakalani unna song lyrics

 




బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా

నిలవాలని ఉన్నా నిలవలేకున్నా

చూడాలని ఉన్నా చూడలేకున్నా

చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా

బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య


1.కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి

కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి

గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి

గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)


2.నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం

శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం

చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి

గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)


No comments:

Post a Comment