Breaking

Monday, 22 November 2021

1 రాజులు ( పరిచయం )

 





పేరు:

మొదట హీబ్రూ బైబిలులో 1, 2 రాజులు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి తర్జుమా చేసేటప్పుడు దానిని రెండుగా విభజించడం జరిగింది.


రచయిత, వ్రాసినకాలం:

యూదుల సాంప్రదాయం ప్రకారం ప్రవక్త అయిన యిర్మీయా ఈ పుస్తకాన్ని రాశాడు. అయితే అలా అనడానికి ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవు. బహుశా యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కొద్దికాలం తరువాత ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగి ఉండవచ్చు.


ముఖ్యాంశాలు:

దావీదు మొదలుకొని యెహోషాపాతు అహాబువరకు ఉన్న రాజుల చరిత్రను ఈ పుస్తకం ముందుకు కొనసాగిస్తుంది. కొన్ని ముఖ్య సంఘటనలు: సొలొమోను దేవాలయాన్ని కట్టించడం, యూదుల గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోవడం, ఉత్తర రాజ్యం అతి త్వరగా విగ్రహ పూజకు, అవినీతికి దిగజారిపోవడం, ప్రవక్త ఏలీయాద్వారా గణించదగ్గ సేవ, మొదలైనవి. 1 రాజులలోని సంఘటనల కాలవ్యవధి 118 సంవత్సరాలు.


విషయసూచిక

రాజుగా సొలొమోను 1:1—11:43

దావీదు చివరి దినాలు, అదోనీయా రాజు కావడానికి ప్రయత్నాలు 1:1-10

దేవుడు, దావీదు ఎన్నిక చేసినది సొలొమోనును 1:11-40

సొలొమోనుకు దావీదు చివరి ఉపదేశం 2:1-9

దావీదు మరణం 2:10-11

సొలొమోను పరిపాలన ఆరంభం, దుష్ట శత్రువులను తొలగించడం 2:12-46

దేవుని మీద సొలొమోను ప్రేమ 3:3

జ్ఞానంకోసం సొలొమోను విన్నపం 3:5-9

జ్ఞానంతోపాటు దేవుడు అనేక దీవెనలను ఇచ్చాడు 3:10-15

ఒక శిశువు – ఇద్దరు తల్లులు,

వివేకంతో సొలొమోను తీసుకొనిన నిర్ణయం 3:16-28

సొలొమోను తన రాజ్యాన్ని చక్కగా అమర్చుకోవడం 4:1-28

సొలొమోను జ్ఞానం 4:29-34

దేవాలయం కట్టడానికి సొలొమోను ఏర్పాట్లు 5:1-18

సొలొమోను దేవాలయాన్ని, తన కోటను కట్టించాడు 6:1—7:51

దేవాలయ ప్రతిష్ఠ 8:1-66

మందసం, మేఘం 8:1-11

సొలొమోను ప్రజలకు ఉపదేశించాడు 8:12-21

సొలొమోను చేసిన గొప్ప ప్రార్థన 8:22-53

సొలొమోనుకు దేవుడిచ్చిన వాగ్దానం 9:1-9

సొలొమోను ఇతర పనులు 9:10-28

సొలొమోను, షేబరాణి 10:1-13

సొలొమోను ఐశ్వర్యం 10:14-29

సొలొమోను పాపంలో పడడం, అతనికి దేవుని సందేశం 11:1-13

సొలొమోను శత్రువులు – హదాదు, రేజను, యరొబాం 11:14-40

సొలొమోను మరణం 11:41-43

రాజ్యం విడిపోవడం 12:1-24

విగ్రహ పూజతో కూడిన అసహ్యమైన మతాన్ని యరొబాం స్థాపించాడు 12:25-33

యరొబాంకు విరుద్ధంగా ప్రకటనలు 13:1—14:20

యూదాకు చెందిన దైవజనుని విశేష కథ 13:1-34

యరొబాం వంశంయొక్క పతనాన్ని గురించి అహీయా ముందుగా చెప్పాడు 14:1-20

యూదాకు దుష్ట రాజు రెహబాం 14:21-31

యూదాకు దుష్ట రాజు అబీయా 15:1-8

యూదాకు మంచి రాజు ఆసా 15:9-24

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు నాదాబు 15:25-32

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు బయెషా 15:33—16:7

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు ఏలా 16:8-14

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు జిమ్రీ 16:15-22

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు ఒమ్రీ 16:21-28

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు అహాబు 16:29—22:40

ఉన్నపాటున ఏలీయా ప్రవక్త కనబడ్డాడు 17:1

ఏలీయాకు కాకులు ఆహారం పెట్టాయి 17:2-6

ఏలీయా, సారేపతు విధవరాలు 17:7-24

ఓబద్యా మంచి గృహనిర్వాహకుడు. అతడు

ఏలీయాను అహాబుదగ్గరకు తీసుకువెళ్ళాడు 18:1-15

కర్మెలు పర్వతంమీద ఏలీయా, బయల్‌దేవుడి ప్రవక్తలు 18:16-39

వర్షం కోసం ఏలీయా ప్రార్థన 18:42-46

ఏలీయా కృంగుబాటు, సీనాయి పర్వతానికి వెళ్ళాడు 19:1-9

దేవుడందించిన ఆదరణ, ఉపదేశం 19:10-18

ఏలీయా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు 19:19-21

సమరయవద్ద బెన్‌హదదు ఓటమి 20:1-34

అహాబుకు దేవుని వర్తమానం 20:35-43

నాబోతు ద్రాక్షతోటను అహాబు ఆశించడం 21:1-4

ఆ ద్రాక్షతోటను తీసుకోడానికి యెజెబెలు ఎత్తుగడ 21:4-16

ఏలీయా దేవుని వర్తమానాన్ని అహాబుకు తెలియజేయడం 21:17-28

మంచివాడైన యెహోషాపాతు, దుష్టుడైన అహాబు 22:1-28

అబద్ధ ప్రవక్తలు చేతులు కలపడం 22:6,10-12

మీకా ప్రవక్త నిజాన్ని చెప్పడం 22:13-28

అహాబు మరణం – మీకా మాటల నెరవేర్పు 22:29-40

యూదాకు మంచి రాజు యెహోషాపాతు 22:41-50

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు అహజ్యా 22:51-53

No comments:

Post a Comment