Topic : మారిన మనిషి
మారాలి! మారకపోతే... మార్పులేని దేవుడు మంచి యీవులు ఎలాఇస్తాడు? పైకి రావాలన్నా, పైకి (పరలోకం) పోవాలన్నా మారక తప్పదు.
1 యాకోబు ప్రార్ధన మారింది (ఆది 32:26)
(భూసంబంధమైన ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టినవాడు - పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు)
2.యాకోబు పేరు మారింది (ఆది 32:27)
(ఒకప్పుడు యాకోబు, అంటే మోసగాడు. ఇప్పుడు ఇశ్రాయేలు - అంటే రాజకుమారుడు)
3.యాకోబు నడక మారింది (ఆది 32:31)
(లోకానుసారంగా బదికినప్పుడు లోకానికి బాగుగాను, దేవుని దృష్టిలో కుంటివాని గాను నడ్చాడు. ఇప్పుడు లోకానికి కుంటివాడయ్యాడు - దేవునికి మంచివాడయ్యాడు)
4.యాకోబు మనస్సు మారింది (ఆది 33:3)
(దీవెనలు దొంగిలించి సహోదరున్ని చావు దెబ్బకొట్టినవాడు - ఇప్పుడు సాగిలపడున్నాడు. దీనత్వమే దైవీక దినుసు) యాకోబు మాట మారింది (ఆది. 33:5) (మనస్సు మారితే మాట కూడా మారి పోతుంది. “నీ సేవకుడు" అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు)
5.చూపు మారింది (ఆది 33:10)
(ఒకప్పుడు శత్రువుగా చూసినవాడు, ఇప్పుడు ఏశావు మొఖంలో దేవుణ్ణి చూడగల్గుతున్నాడు)
6.యాకోబు బ్రతుకు మారింది (ఆది 38:20)
(ఇప్పుడు బలిపీఠం కట్టి ఆరాధన వీరునిగా మారిపోయాడు) బదుకంతా పాపముతో కుళ్లి కంపుకొడుతున్న సమరయస్త్రీ, ఆ బావి
దగ్గర యేనయ్యను కల్సింది, ఏం జరిగింది? బదుకు
భాగ్యవంతమైంది! మరి మీ బ్రతుకెలా వుంది?
No comments:
Post a Comment