దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
రోమీయులకు 14: 17
ప్రియులారా
దేవుడు ఈ లోకములో నుండి మనలను వేరుపరచి తన రాజ్య వారసులనుగా చేసుకున్నాడు మనము ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచడానికి వీలులేదు
శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; అని వ్రాయబడి యుంది
ప్రియులారా
తన రాజ్యమునకును మహిమకును మనలను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనము నడుచుకొనవలసిన వారమై యున్నాము
పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.అని
సహోదరి సహోదరులారా
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి.
మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
మనము చిత్తమును స్పష్టముగా గ్రహించి మనము చేసే ప్రతి మంచి పనిలో సఫలులమౌతూ
దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలసిన వారమై యున్నాము
ఈ వాక్యం మనము భూసంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటిమీదనే మన మనస్సు నిలపాలని తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకొను వారమై యుందాం
తన రాజ్యమునకును మహిమకును మనలను పిలుచుచున్న దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మనలను నింపునుగాక.ఆమేన్
No comments:
Post a Comment