Breaking

Monday, 22 March 2021

కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఏడు లాభాలు

 






కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప లక్షణమని కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు
అయినప్పటికీ అన్ని తెలిసినప్పటికీ కృతజ్ఞత లేని జీవితం జీవించే వారు లేకపోలేదు
పెద్దవారు చిన్న వారికి చెప్తారు
సహాయం చేసిన వారికి కృతజ్ఞత కలిగి ఉండమని
కానీ అలా చెప్పే వారిలో చాలా మంది వారే కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉంటారు దానికి గల కారణం పొందుకున్న మేలులను మరచిపోవడమే
దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని
ప్రియులారా
దావీదు దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకుంటూమరి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవాడు
ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడటం
ఆయన సహాయముతో ప్రతి సమస్యను పరిష్కరించుకోవడం ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం దావీదుకు అలవాటుగా మారిపోయింది
ఈరోజు మనలో చాలా మంది అనేక సమస్యల గుండా వెళుతున్నారు ఆ సమస్యలు తీరితే దేవుని కృతజ్ఞుడనై యుందునే అని ఆశ పడుతున్నారు 
అయితె ఇంత వరకు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఎంతవరకు కృతజ్ఞత కలిగి యున్నామని అలోచించి నట్లైతే చాలా మంది కృతజ్ఞత లేని జీవితమే జీవిస్తున్నామని సమాధానమిస్తారు
ఒకరోజు యేసుప్రభు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు
వచ్చారు ప్రభువా, మమ్మును కరుణించుమని ఆయనను వేడుకున్నారు
అప్పుడు యేసయ్య మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని చెప్పగా వారు ఆ మాట నమ్మి వెళ్లిరి  వారు అలా వెళ్లుచుండగానే, శుద్ధులైరి.
అయితే వారిలో ఒకడు మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి
గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొదుట సాగిలపడ్డాడు
మిగితా తొమ్మిది మందైతే కృతజ్ఞతలు చెల్లించాలన్న విషయమే మరచిపోయారు
ఈరోజు మనలో చాలా మంది దేవుడు చేసిన మేలులను మరచిపోయి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం మానేసి ఎంత సేపు వారికున్న
సమస్యలను బట్టి సణుగుతూ నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు
మన దేవుడు మనకున్న ప్రతి సమస్య నుండి విడిపించుటకు చాలిన వాడు అయితే ఎంత సేపు మనము ఆ సమస్య వైపే చూస్తూ దేవునిపై సణుగుతూ
నిరాశకు నిస్పృహకు లోనవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు
అయితె ఇంత వరకు దేవుడు చేసిన మేలులను
గుర్తు చేసుకుంటు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం వలన అలాగే ఆయన చేయబోయే మేలులను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం వలన
దేవుని గొప్ప మేలులను మన జీవితంలో చూడగలం
చేయబోయే మేలులను బట్టి ముందుగానే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం అనేది మన విశ్వాసాన్ని కనుపరిచే ఒక ప్రక్రియ దీని వలన దేవుని అద్భుతాలను మన జీవితంలో చూడగలం

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఏడు ప్రయోజనాలేంటో  దేవునికి కృతజ్ఞత కలిగి  ఉండాలంటే మనము ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం
మొదటిగా

కృతజ్ఞత కలిగిన జీవితం వల్ల మనకు కలిగే
ప్రయోజనం ఏంటంటే

దేవుణ్ణి ప్రేమించగల్గుతాం

దేవుడు మనము ప్రతి విషయమునందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అలా చేయడం  ఆయన చిత్తమని తెలియజేశాడు
మనము దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామంటే
మనము ఆయన్ను ప్రేమిస్తున్నామని అర్థం
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; అని ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని వ్రాయబడి ఉంది
ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమనేది కొన్ని సార్లు కష్టమే అని అనిపించవచ్చు కానీ దేవునిపై గనుక మనము పూర్ణ
విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఏది జరిగిన ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలుగుతాం
ఆయన చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చగలుగుతాం
ఆయన చిత్తం నెరవేర్చే ప్రతీ ఒక్కరు ఆయన్ను ప్రేమించేవారే ఆయన్ను ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన వలన కలిగే ప్రతీ మేలునకు అర్హులే

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే

దేవుణ్ణి ఆరాధించగలుగుతాం

దేవుణ్ణి ఆరాధించమంటే చాలా మంది దేవునికి ప్రార్ధిస్తూ ఉంటారు ఆరాధించాలనుకున్న వారికీ ప్రార్ధనే వస్తుంది దానికి గల కారణం ఆయన చేసిన మేలులతో నింపబడి ఉండాల్సిన హృదయం సమస్యలతో
సణుగులతో నింపబడి ఉండడమే
ఎంత సేపు మన ఆలోచనలు మన అవసరతల మీదనే ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా మనము ఆయన్ను ఆరాధించలేం మనకున్న అవసరతలు అన్ని తీర్చుటకు ఆయన చాలినవాడని విశ్వసించి ఎప్పుడైతే ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటామో అప్పుడే మనస్ఫూర్తిగా మనము ఆయన్ను  ఆరాధించగలుగుతాం
దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఆయన్ను ఆరాధించడంలో ఒక భాగమే అనే విషయాన్నీ గమనించాలి
కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.అని
ప్రియులారా
ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకుంటామో
అప్పుడే ఆయన మనల్ని ఘనపరుస్తాడు
గనుక మనము ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ను  ఆరాధించు వారమై యుందాం

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే మూడవ ప్రయోజనం ఏంటంటే

మన ఆలోచనల్లో నిలకడ కలిగి ఉంటాం

ఈ రోజు చాలా మంది ఆలోచనల్లో నిలకడ లేక
నెగటివ్ గా ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ  ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు
ఏం జరుగుతుందో అన్న భయముతో నెమ్మది లేక జీవిస్తున్నారు అయితే అటువంటి స్థితిలో మనముండాలని దేవుడు ఏమాత్రం ఆశించట్లేదు
మన చింతలన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండాలని మన ఆలోచనల్లో నిలకడగా ఉండాలని ఆయన కొరుకుంటున్నాడు 
అయితే మన విశ్వాసం పెంపొందే కొలదే ఇది సాధ్యమవుతుంది
ఎప్పుడైతే మనము దేవుడు చేసిన కార్యాలను దేవుడు చెప్పిన మాటలను 
గుర్తు చేసుకుంటూ వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటామొ అపుడే దేవుడు చేసిన కార్యాలను దేవుడు చెప్పిన మాటలను  బట్టి మన విశ్వాసం మరింతగా బలపడుతుంది 
దేవునిపై మనకు నమ్మకముందని 
ఆయన చేసిన కార్యాలు ఆయన చెప్పిన మాటలు గొప్పవని ఆయన మన జీవితంలో కార్యము చేయుటకు చాలిన వాడని మనము ఆయనకు
కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ద్వారా కూడా
తెలియజేయగలం
గనుక మన విశ్వాసాన్ని బలపరచుకుంటూ మన చింతలన్నీ ఆయన మీద వేసి ఆయన మన జీవితంలో చేసిన చేయబోయే మేలులను బట్టి
ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తు మన ఆలోచనల్లో నిలకడ కలిగి యుందాం

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే నాల్గవ ప్రయోజనం ఏంటంటే

తగ్గింపు తత్వం కలిగి ఉండగలుగుతాం

ఈ రోజుల్లో ఎటు చూసిన తమను తాము హెచ్చించుకునేవారే  మనకు కనిపిస్తున్నారు
దేవుడు మనము తగ్గింపు తత్వం కలిగి ఉండాలని
ఆయన చేతి క్రింద దీనమనస్కులమై ఉండాలని ఆశిస్తున్నాడు
మనము కలిగి యున్నవన్నీ మనవల్లే కలిగినవని
మనము సాంధించినవన్ని మన సొంత శక్తి చేతనే సాంధించామని అనుకునే వారంతా వారిని వారు హెచ్చించుకుంటు ఉంటారు ఇలాంటి వారు
దేవుని మార్గములో నడువలేరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేరు
ఎవరైతే నేనేం కలిగి యున్నానో అది దేవుని కృప వలననే కలిగి యున్నానని నేనేం సాధించానో అది దేవుని సహాయం వలననే సాధించానని విశ్వసిస్తారో
అలాంటి వారు మాత్రమే దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించగలుగుతారు అలా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వారే దేవుని చేతి క్రింద దీనమనస్కులై ఉండగలుగుతారు

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఐదవ ప్రయోజనం ఏంటంటే

చింతను జయించగలుగుతాము

ఈరోజు వారికున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి అధికముగా చింతించే వారు అనేకులు ఉన్నారు
చింత అనేది అవిశ్వాసానికి గుర్తుగా ఉంది
మనము చింతిస్తున్నాము అంటే దేవుని మీద నమ్మకం లేదని చెప్పకనే చెప్తున్నాం
మన జీవితంలో దేవుని కార్యాలు జరుగకుండా
దేవుని అద్భుతాలు జరుగకుండా అడ్డుపడే పెద్ద అడ్డుబండ అవిశ్వాసం అనే విషయాన్ని గ్రహించాలి
ఎప్పుడైతే మనము చింతను జయిస్తామో అప్పుడే
దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం
చింతను జయించాలంటే గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను దేవుడు చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి
దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా
దేవుని శక్తిని దేవుని నమ్మకత్వాన్ని గ్రహిస్తు ఆయనపై మన విస్వాసాన్ని పెంపొందించుకుంటాం
ఎప్పుడైతే మనలో విశ్వాసం పెరుగుతుందో
అప్పుడె మన చింతలన్నీ తొలగించబడుతాయి

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఆరవ  ప్రయోజనం ఏంటంటే

ఎవరిని చూసి అసూయ పడము

దేవునికి కృతజ్ఞత కలిగి యుండెవారు తృప్తిగా జీవిస్తారు ఇతరులతో పోల్చుకుని అసూయా చెందరు
కృతజ్ఞతలేని వారిలోనే తృప్తి లేకపోవడం ఇతరులను చూసి అసూయా చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి
మనము ఇతరులను చూసి అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నామనే విషయాన్ని గ్రహించాలి
అసూయ లోలోపల మనల్ని క్షిణింపజేస్తుంది
దేవుడు మనము ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాడు
గనుక దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడు ఆయనలో ఆనందించు వారమై యుందాం

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఏడవ ప్రయోజనం ఏంటంటే

మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుంది

మనము కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నప్పుడు
మన హృదయము మన సమస్యల వైపునకు మన చుట్టు ఉన్నవారి పురోగతి వైపునకు త్రిప్పబడి ఉంటుంది
వాటిని చూస్తూ వారి గురించి ఆలోచిస్తూ నిరాశ నిస్పృహకు లోనవుతూ అసూయా చెందుతూ
ఉంటాము
అలా కాకుండా మనమేం కలిగి యున్నామో
దేవుడు మనకేదిచ్చాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉన్నట్లయితే
అప్పుడు మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుంది
ఎప్పుడైతే మన హృదయం దేవుని వైపునకు త్రిప్పబడుతుందో అప్పుడు దేవుడు మన హృదయములో ఉన్న నిరాశ నిస్పృహ అసూయా
ఆవేదన లాంటివన్ని తొలగించి
విశ్వాసముతో మన హృదయాన్ని నింపి
నిరీక్షణతో మనల్ని ముందుకు నడిపిస్తాడు
మనము చేరుకోవాల్సిన గమ్యానికి  ఆయనే మనల్ని
సురక్షితముగా చేరుస్తాడు
గనుక మనము దేవునికి కృతజ్ఞత కలిగి యుంటూ
మన హృదయాలను ఆయన  వైపునకు త్రిప్పుకుందాం

దేవునికి కృతజ్ఞత కలిగి యుండడం వల్ల మనకు కలిగే ఏడు ప్రయోజనాల గురించిన ఈ వాక్యం
మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేలా మిమ్మల్ని ప్రోత్సహపరుస్తుందని ఆశిస్తున్నాను





1 comment: