Breaking

Friday, 12 March 2021

ప్రతీ రోజు బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే మూడు ప్రయోజనాలు.

 


ప్రతీరోజు బైబిల్ చదవడం అనేది ఒక అద్భుతమైన అలవాటు. 

అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది  బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అయితె వాటిలో ప్రాముఖ్యమైన మూడు ప్రయోజనాల గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను

 

మొదటగా ప్రతీ రోజు బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనమేమిటంటే 

ఆధ్యాత్మికంగా పోషించబడతాము 

ఆధ్యాత్మికంగా పోషించబడతాము 

ఈ లోకములో మనము బ్రతకడానికి ఆరోగ్యంగా  ఉండడానికి శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ప్రతీ రోజు భుజిస్తూ ఉంటాము 

అయితే ఆత్మీయంగా సజీవంగా ఉండడానికి కూడా 

మనము ప్రతీ రోజు ఆత్మీయ ఆహారాన్ని భుజించాల్సి ఉంటుంది 

దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారమై యున్నదనే విషయాన్నీ మనం గమనించాలి 

దేవుని వాక్యన్ని  మనము చదివే కొలది 

ఆధ్యాత్మికంగా పోషించబడుతూ ఉంటాము 

దేవుని వాక్యన్ని  మనము చదివే కొలది 

ఆత్మలో బలము పొందుకుంటూ ఉంటాము 

దేవుడు మనము బలవంతులముగా ఉండాలని 

ఆశిస్తున్నాడు 

ఒకప్పుడు మనము మన ఇష్టానుసారంగా జీవించాము ఏది చూడాలనిపిస్తే అది చూసాం ఏది వినాలనిపిస్తే అది విన్నాం ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్ళాం 

దేవుని భయము లేక మనుషుల భయం లేక 

నిర్భయముగా తిరిగాం 

కానీ ఎప్పుడైతే మనము క్రీస్తును విశ్వసించామో 

క్రీస్తులో నూతనంగా జన్మించామో అప్పటినుండి మన చూపులు మన మాటలు మన చేతలు పూర్తిగా మారిపోవాలి దేవుని భయము కలిగి జీవిస్తూ 

క్రీస్తు స్వరూప్యములోకి మార్చబడాలి 

ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వినడం వాక్యాన్ని ధ్యానించడం ప్రారంబిస్తామో అప్ప్పటినుండి ఆ వాక్యాన్ని ఉపయోగించి పరిశుద్దాత్మ దేవుడు 

మనలను క్రీస్తు స్వరూప్యములోకి మారుస్తు ఉంటాడు

మనలోని పనికి రాని ప్రతీ తీగెను తొలగిస్తూ ఆయనలో ఫలించేవారినిగా మనలను మారుస్తూ ఉంటాడు 

అపొస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు 

ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.అని 

ప్రియులారా

రక్షించబడిన ప్రతీ యొక్క వ్యక్తి ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమను పాలను అపేక్షించాలని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు 

పుట్టిన పిల్లలు ఎదగడం చూసి తల్లి దండ్రులు ఎంతో సంతోషిస్తారు అదే విధంగా ఆత్మలో జన్మించిన ప్రతీ యొక్క ఆత్మీయుడు ఆధ్యాత్మికంగా ఎదగడం చూసి 

ఆత్మయై యున్న దేవుడు సంతోశిష్తాడనే విషయాన్ని 

మనము గమనించాలి

మనమే స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండడం ఎప్పటికిని దేవుని చిత్తము కాదు  

గనుక మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా 

ప్రతీ రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆత్మలో ఎదుగు వారమై యుందాం 



ప్రతీ రోజు బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనమేమిటంటే 

ఆత్మలో శుద్దీకరించబడతాము 

ఆత్మలో శుద్దీకరించబడతాము 

మన దేవుడు పరిశుద్ధుడు 

పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్న మనము కుడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు 

ఈ లోకములో ఎటు చూసిన పాపము వెంట పరుగులు పెడుతున్న మనుషులు మనకు కనిపిస్తున్నారు 

పాపిష్టి లోకములో మనము పరిశుద్ధముగా జీవించాలంటే మనము కలిగి ఉన్న పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మనకు ఆధారం దేవుని వాక్యమే 

దేవుని వాక్యమే మనలను పరిశుద్ధ పరిచేది దేవుని వాక్యమే మనలను పరిశుద్ధ మార్గములో నడిపేది 

మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుని వాక్యాన్ని 

కుడా ప్రేమిస్తాము దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు ఈ లోకములో పరిశుద్ధముగా జీవిస్తారు 

అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు  క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.అని 

ప్రియులారా

యేసుక్రీస్తు మనము కలిగి ఉన్న మలినాన్ని తొలగించుటకై పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి  

మనకు రావాల్సిన శిక్షను మన స్థానములో భరించాడు 

పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించి మనలను

తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత మనలను పవిత్రపరిచాడు 

పరిశుద్ధ పరచబడిన మనము ఈ లోక మాలిన్యము అంటకుండ ఆ పరిశుద్ధతను కాపాడుకొనవలసిన వారమై యున్నాము 

ఐగుప్తు దేశములో అన్య జనుల మధ్య నివసిస్తున్న యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు 

తన యజమానుని భార్య తనతో పాపము చేయమని 

శోధించినప్పుడు అతడు ఒప్పక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని ఆమెతో చెప్పాడు 

అక్కడ నుండి దూరంగా పారిపోయాడు 

దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికే అధిపతిగా నియమించాడు 

యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు గనుకనే పాపాన్ని ద్వేషించాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు 

మరి మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొనవలసిన వారమై యున్నాము 

దేవున్ని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ 

పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా లేదా లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామా 

దావీదు భక్తుడు దేవుని యెదుట పాపము చేయకుండునట్లు తన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకునే వాడు 

దేవుని వాక్యానికి మన హృదయములో చోటిస్తున్నామా లేదా లోకసంబంధమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటున్నామా 

ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నను మన హృదయాలు ఎంతగా మాలినమైపోయినను 

దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చినట్లైతే 

ఆయన మన హృదయాన్ని శుద్ధీకరించి నూతన హృదయాన్ని 

నూతన ప్రారంభాన్ని అనుగ్రహించుటకు ఇష్టపడువాడై యున్నాడు 

గనుక ప్రతీ దినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ఈ లోకములో దేవుని కొరకు పరిశుద్దముగా జీవిద్దాం 



ప్రతీ రోజు బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే మూడవ ప్రయోజనమేమిటంటే 

అనేక విషయాలు నేర్చుకుంటు ఉంటాము 

అనేక విషయాలు నేర్చుకుంటు ఉంటాము 

ఎవరైతే నాకు అన్ని తెలుసు అనుకుంటారో వారు 

తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా 

ఉన్నాయి అనే విషయాన్ని వారు గ్రహించాలి 

బైబిల్ చదివే కొలది అనేకమైన క్రొత్త విషయాలు 

దేవుడు మనకు బయలు పరుస్తూ ఉంటాడు 

బైబిల్ ఒక గని లాంటిది అని ఒక భక్తుడన్నాడు మనము త్రవ్వే కొలది ఇంకా అనేకమైన క్రొత్త విషయాలు మనకు బయల్పడుతూనే ఉంటాయి కానీ బాధాకరమైన విషయమేమిటంటే ఆ గనిని త్రవ్వే వారే కరువయ్యారు 

మన బ్రతులను మార్చే మన భవిష్యత్తును నిర్ధేశించే 

బైబిల్ ని వదిలి పెట్టి మనుషులు చెప్పే మాయ మాటలు వింటూ అనేకమంది మోసపోతున్నారు 

వారి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు 

ఇకనైన మనము దేవునికి దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ 

ఆ వాక్యాన్ని ప్రతీ దినం ధ్యానిస్తూ ఆయన పాదాల చెంత అనేకమైన విషయాలు నేర్చుకొనువారమై యుందాం 

దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు 

నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.

నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.

నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.

నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. అని 

ప్రియులారా

దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది 

దుష్టమార్గములన్నింటిలో నుండి మనలను విడిపిస్తుంది 

మనము ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో స్పష్టంగా మనకు నేర్పిస్తుంది 

గనుక మనము ప్రతీ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ 

ఆయనిచ్చే జ్ఞానాన్ని పొందుకొని అనేకమైన క్రొత్త విషయాలు నేర్చుకుంటు ఆయన మార్గములో నడిచే వారమై యుందాం 


ప్రతి రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనకు కలిగే మూడు ప్రయోజనాల గురించిన ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని 

వాక్య ధ్యానమును గూర్చిన ఆసక్తిని మీలో పెంచుతుందని ఆశిస్తున్నాను 

No comments:

Post a Comment