మనము దేవునికి ప్రార్ధించడంవళ్ళ మనకు కలిగే పది ప్రయోజనాలు
మనము ప్రార్ధించాలని మనము చేసే ప్రతీ ప్రార్ధనకు జవాబులు పొందాలని ప్రార్ధన పరులముగా మనము మారాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి యున్నాడు
కానీ చాలా సార్లు ప్రార్ధించే మనసు లేక ప్రార్ధించిన
జవాబులు పొందక అసలు ప్రార్ధన వలన కలిగే
ప్రయోజనాలు ఏంటో అర్థం కాక ప్రార్ధనను మానేసిన వారు లేకపోలేదు
""ప్రార్ధన క్రైస్థవునికి వెన్నెఎముక లాంటిదని ఒక భక్తుడన్నాడు వెన్నెఎముక లేక పోతే మనిషి ఏ విధంగా నిలబడలేడో ప్రార్ధన లేకపోతే క్రైస్తవుడు కూడా ఈ లోకములో దేవుని కొరకు నిలబడలేడు""
ప్రార్ధన యొక్క ప్రాముఖ్యతను గూర్చి ప్రార్ధన యొక్క ప్రభావమును గూర్చి అనేక సార్లు బైబిల్ లో వ్రాయబడి యుండటం చూస్తాం
అయితే అంత ప్రాముఖ్యమైన ప్రార్ధనను ఎంతో ప్రభావమును చూపే ప్రార్ధనను ఎందుకని మనము నిర్లక్ష్యం చేస్తున్నాము
ఎందుకని ప్రార్ధనలో మనము ఆనందించలేక పోతున్నాము
ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వళ్ళ కలిగే ప్రయోజనాలేంటో ఆ ప్రయోజనాలు ఎంత శ్రేష్ఠమైనవో మనకర్థమైతే ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేస్తాం
ఆ పనిలో ఆనందిస్తాం కూడా
అదేవిధంగా ప్రార్ధిస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటో
ఆ ప్రయోజనాలు ఎంత శ్రేష్ఠమైనవో మనకర్థమైతే
ప్రార్ధనను మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయం ప్రార్ధనలో ఆనందిస్తాం కూడా
అందుకే ఈ రోజు ప్రార్ధన వలన కలిగే పది ప్రయోజనాలేంటో తెలుసుకుందాం
మొదటగా ప్రార్ధించడం వళ్ళ మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే
దేవునితో మన సంబంధం బలపడుతుంది
దేవునితో మన సంబంధం బలపడుతుంది
ఎవరినైతే మనము ప్రేమిస్తామో వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం
ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారితో మన సంబంధం బలపడుతుంది
"""ఎందుకంటే వారి మనసెంటో వారి మంచితనమేంటో
మనకర్థమౌతుంది మనమేంటో వారికి తెలుస్తుంది ""
ఆ విధంగా వారితో మనకున్న సంబంధం బలపడుతూ ఉంటుంది
అదేవిధంగా మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే
ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం
ఆయనతో ఎక్కువ సమయం గడిపే కొలది
ఆయనేంటో ఆయన మంచితనమేంటో ఆయన ప్రేమేంటో మనకర్థమౌతుంది
ఆయనతో మనుకున్న సంబంధం బలపడుతూ ఉంటుంది
ఈ లోకములో మనుషులతో మనకున్న సంబంధం బలపడితేనే మనము ఎంతగానో సంతోషిస్తామే
అదే దేవాది దేవునితో మన సంబంధం బలపడితే ఆయనతో ఐక్యం గళవారమైతే ఇంకెంతగా సంతోషిస్తామే ఆలోచించండి
గనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనతో ఎక్కువ సమయం గడుపుతూ
ఆయనతో మనకున్న సంబందాని బలపరచుకుంటూ ఆయనలో ఆనందిద్దాం
ప్రార్ధన వలన కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే
దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాము
దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాము
చాలా మంది దేవునికి ప్రార్ధించకపోవడానికి దేవునితో ఎక్కువ సమయం గడపక పోవడానికి ప్రధాన కారణం
దేవుని ప్రేమేంటో వారికి అర్థం కాకపోవడమే
దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు
ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తయినది పాతాళము కంటే లోతైనది
ఆయన ప్రేమను వర్ణింపగలవాడెవడు
ఆయన ప్రేమను మనము వివరింపగలమా
ఆయన ప్రేమ తెలియకే ఈ రోజు ఎంతో మంది నశించి పోతున్నారు
ఆ ప్రేమామయుణ్ణి కలిగి యున్న మనము కూడా
ఆయనకు ప్రార్ధించకుండా ఆయన ప్రేమను సరిగ్గ అర్థం చేసుకోకుండా ఆయనకు ఆయాసకరంగా జీవించడం ఎంత దుర్బలమొ ఆలోచించండి
ఇకనైన మనము దేవునికి ప్రార్ధిస్తూ ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయనకు అంగీకారంగా జీవిద్దాం
దేవునికి ప్రార్ధించడం వళ్ళ మనకు కలిగే మూడవ ప్రయోజనము ఏంటంటే
దేవుని దగ్గర్నుంచి జవాబులు పొందుకుంటాం
దేవుని దగ్గర్నుంచి జవాబులు పొందుకుంటాం
చాలా మంది వారికున్న సమస్యల నుండి విడుదల పొందుకోలేక వారికున్న ప్రశ్నలకు సమాధానం దొరకక సతమతమౌతూ ఉంటారు
అయితే మనము దేవునికి ప్రార్ధిస్తే మన సమస్యల నుండి విడుదల నిచ్చి మన ప్రతీ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకు ఆయన ఇష్టపడువాడై యున్నాడు
గనుక మనకున్న ప్రతీ సమస్యను విశ్వాసముతో ఆయనకు అప్పగించి మన ప్రతీ ప్రశ్నకు అయన దగ్గర్నుంచి జవాబులు పొందుకొనువారమై యుందాము
దేవునికి ప్రార్ధించడం వళ్ళ మనకు కలిగే నాల్గవ ప్రయోజనము ఏంటంటే
దేవుని నడిపింపును కలిగి యుంటాము
దేవుని నడిపింపును కలిగి యుంటాము
చాలా మంది వారి జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక
పోతుంటారు ఎం చేయాలో అర్థం కాక ఆందోళనకు లోనవుతూ ఉంటారు చివరికి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాటి వల్ల కలిగే నష్టాలను భరిస్తూ ఉంటారు
అయితే మనము దేవునికి ప్రార్ధించేవారముగా ఉన్నట్లయితే ఆయన నడిపింపును ఎల్లపుడు కలిగి యుంటాము ఎం చేయాలో ఎం చేయకూడదో ఏది సరైనదో ఏది సరైనది కాదో అనే గ్రహింపును దేవుడు మనకనుగ్రహిస్తాడు మన నిర్ణయాలు కచ్చితమైనవిగా ఉండేలా ఆయన కృపచూపుతాడు
దేవునికి ప్రార్ధించడం వళ్ళ మనకు కలిగే ఐదవ ప్రయోజనము ఏంటంటే
శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాము
శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాము
యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా తన శిష్యులతో ఈ మాట చెప్పాడు
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా ఉండి ప్రార్ధించుడి అని
ప్రియులారా
ఎటు చూసిన పాపము పెట్రేగి పోతున్న రోజుల్లో మనము బ్రతుకుతున్నాము
పాపిష్టి లోకములో మనము పరిశుద్ధముగా జీవించాలంటే కచ్చితంగా ప్రార్ధన జీవితాన్ని కలిగి ఉండవలసిందే
ప్రార్ధన మనల్ని శక్తి వంతులుగా చేస్తుంది
ప్రార్ధన పాపం చేయకుండ మనల్ని ఆపుతుంది
గనుక మనము మెలుకువగా ఉండి యెడతెగక దేవునికి ప్రార్ధించువారమై యుందాం
ప్రార్ధన వలన మనకు కలిగే ఆరవ ప్రయోజనము ఏంటంటే
దేవుని చిత్తానికి మనల్ని మనం సంపూర్ణముగా అప్పగించుకుంటాం
యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్ధించి నప్పుడు
తండ్రి సాధ్యమయితే ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్ధించెను తండ్రి చిత్తానికి సంపూర్ణముగా తనను తాను అప్పగించుకొనెను
ప్రియులారా
మనము ప్రార్ధించినప్పుడు మన ఇష్టాన్ని సిలువ వేసి
తండ్రి చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోగలము
ప్రార్ధన దేవుని ఉద్దేశాలకు మనము లోబడే విధంగా
చేస్తుంది ప్రార్ధన దేవుని సంకల్పాలను మనము సంపూర్ణముగా నెరవేర్చేలా చేస్తుంది
గనుక మనము ప్రార్ధన జీవితాన్ని కాపాడుకుంటూ
తండ్రి చిత్తాన్ని చేయువారమై యుందాం
ప్రార్ధన వలన మనకు కలిగే ఏడవ ప్రయోజనము ఏంటంటే
ప్రతీ పనిని ప్రభావవంతముగా చేయగలుగుతాము
ప్రతీ పనిని ప్రభావవంతముగా చేయగలుగుతాము
ప్రార్ధనలో ఎంత ఎక్కువ సమయము గడుపుతామో అంత ఎక్కువుగా దేవుని ఆత్మ చేత నింపబడుతాము
దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడుతామో
దేవుని ఆత్మ ప్రేరేపణతో మనము చేసే ప్రతీ పని
బహు ప్రభావవంతముగా ఉంటుంది
శిష్యులు మెడ గదిలో ప్రార్ధిస్తుండగా దేవుని ఆత్మ ఆ గదిలో ఉన్న వారందరి పైన కుమ్మరించబడెను
దేవుని ఆత్మ చేత వారు ఎప్పుడైతే నింపబడ్డారో
దేవుని పనిని బలముగా చేయగలిగారు
అనేకులు వారు చెప్పే మాటలు విని యేసుక్రీస్తు నందు విశ్వాసముంచారు అనేకమైన సూచకక్రియలు మహాత్ క్రియలు అద్భుత కార్యాలు ప్రజల మధ్య చేయగలిగారు
గనుక ఎక్కువ సమయం మనము ప్రార్ధనలో గడుపుతూ దేవుని ఆత్మ చేత నింపబడి
దేవుని ఆత్మ ప్రేరేపణతో ప్రతీ పనిని బహు ప్రభావవంతముగా చేయువారమై యుందాం
ప్రార్ధన వలన మనకు కలిగే ఎనిమిదవ ప్రయోజనము ఏంటంటే
దేవుని అద్భుతాలను మన జీవితములో చూడగలుగుతాము
మోషే ప్రార్ధించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు
యెహోషువా ప్రార్ధించినప్పుడు దేవుడు సూర్య చంద్రులను ఆపివేశాడు
ఏలీయా ప్రార్ధించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది
ప్రియులారా మనము విశ్వాసముతో ప్రార్ధిస్తే మన ఊహకు అందనంత అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనుకున్నాడు
గనుక మనమాయన యందు విశ్వాసముంచి
ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగు లాగున ఆయనకు ప్రార్ధించు వారమై యుందాం
ప్రార్ధన వలన మనకు కలిగే తొమ్మిదవ ప్రయోజనము ఏంటంటే
దేవుని సమాధానము చేత నింపబడుతాము
దేవుని సమాధానము చేత నింపబడుతాము
చాలా మంది ఈ రోజుల్లో శాంతి సమాధానం లేక ఒత్తిడికి లోనవుతూ అల్లాడిపోతూ ఉన్నారు
శాంతి సమాధానం కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటారు ఏవేవో చేస్తుంటారు కానీ ఒక వ్యక్తికి నిజమైన శాంతి సమాధానాలు దొరికేది దేవుని దగ్గర మాత్రమే
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. అని యేసయ్య సెలవిస్తున్నాడు
ప్రియులారా
మనము ఎటువంటి బారాలు కలిగి యున్న
దేవుని దగ్గరికి వచ్చి మన భారాన్ని ఆయన మీద వేసినట్లయితే విశ్రాంతిని మనకు అనుగ్రహించుటకు
గొప్ప సమాధానము చేత గొప్ప నెమ్మది చేత మన హృదయాలను నింపుటకు ఆయన చాలిన వాడై యున్నాడు
గనుక మనమాయనకు ప్రార్ధించి ఆయన
సమాధానము చేత నింపబడువారమై యుందాం
ప్రార్ధన వలన మనకు కలిగే పదవ ప్రయోజనము ఏంటంటే
దేవుని స్వారూప్యములోకి మారుతాము
దేవుని స్వారూప్యములోకి మారుతాము
దేవుడు తన పోలికలో తన స్వరూపములో
మనల్ని సృష్టించాడు ఆయన వలె మనము జీవించాలని ఆశించాడు కానీ మనిషి దేవుని అజ్ఞను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డాడు దేవుని రూపము కోల్పోయి అపవిత్రునిగా మారాడు
ఆ అపవిత్రత నుండి మనల్ని విడిపించడానికే
తన స్వరూప్యములోకి మనల్ని మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు
ఆయన అతిసుందరుడు అతికాంక్షనీయుడు అయినప్పటికీ మన కోసం సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మారాడు సిలువలో తన రక్తం కార్చి మన కొరకు తన ప్రాణాలర్పించాడు
ఆయన చేసిన ఆ సిలువ త్యాగాన్ని మనము విశ్వసించి ఆయనను మన రక్షకునిగా అంగీకరించి ఆయన పాదాలను ఆశ్రయించినట్లైతె ఆయన మన అపవిత్రత యావత్తును తొలగించి తన రక్థములో కడిగి శుద్ధులుగా చేస్తాడు
తన స్వరూప్యములోకి మారుస్తాడు
ప్రార్ధించడం వళ్ళ మనకు కలిగే పది ప్రయోజనాల గురించిన ఈ వాక్యం మి ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మీ ప్రార్ధన జీవితాన్ని పురిగొల్పుతుందని ఆశిస్తున్నాను
No comments:
Post a Comment