ఎలుకల చేత, చీమల చేత తినివేయబడుతూ ఒక స్త్రీ రోడ్డు ప్రక్కన పడి ఉంది. ఏడ్చుటకు కూడా ఓపికలేనంత బలహీనంగా ఉంది ఆమె. ఆ సమయంలో ఒక దేనదూత వచ్చి ఆమెను భుజములపై ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది. వారు ఆసుపత్రి లోపలికి అనుమతించబడలేదు. అయితే, ఆ దూత ఎంతో పట్టుబట్టి గోజాడుట వలన ఆ స్త్రీ ఆసుపత్రిలో చేర్చుకొనబడి చికిత్స పొందింది.
కరుణా దూతగా పిలువబడిన మథర్ థెరిస్సా అటువంటి దిక్కులేని ఎంతో మంది స్త్రీలకు తల్లి అయ్యారు. సహాయం చేయుట అనేది ఆమె ఎంచుకున్న మార్గమో లేక ఇతరులకు సేవలనందించటం ఆమె యొక్క ప్రధాన కర్తవ్యమో కాదుగానీ, అది ఆమె యొక్క జీవనశైలి. వేలాది మంది పేదవారికి ఆశ్రయమిచ్చి పోషించటమే కాకుండా వారు
క్రీస్తుని తమ రక్షకునిగా ఎరుగుటకు ఆమె సహాయం చేశారు. 18సం||ల వయస్సులో సేవ చేయమని దేవుని నుండి వచ్చిన పిలుపుకు విధేయులై దేవుని కొరకు ఒక సన్యాసినిగా జీవించుటకు తనను తాను సమర్పించుకున్నారు మథర్ థెరిస్సా. సేవ కొరకై మొదటిగా భారతదేశంలోని డార్జిలింగ్ ప్రాంతానికి పంపబడిన ఆమె అటు తరువాత కలకత్తా నగరానికి
వచ్చారు. అక్కడ ఒక ఉపాధ్యాయురాలిగా సేవలనందించి, విద్యాభ్యాసం ద్వారా పేదరికాన్ని
పారద్రోలుటకు కృషి చేశారు.
తరువాతి కాలంలో ఆశ్రయంలేనివారి కొరకు, ఆకలితో అనమటిస్తున్న వారి కొరకు “మిషనరీస్ ఆఫ్ ఛారిటీ” (సంఘసేవ చేసే మిషనరీలు) అనే సేవాసంస్థను సాపించారు. సమాజంచే తృణీకరించబడిన వారు, దిక్కులేనివారు, ఎటువంటి
ప్రేమానురాగాలకూ నోచుకోనివారు మొదలగు వారందరూ ఇక్కడికి ఆహ్వానితులే. ఆరంభదశలో ఎటువంటి విరాళాలు లేక కేవలం దేవుని పైనే ఆధారపడి సేవ చేసినప్పటికీ త్వరలోనే స్వచ్ఛందంగా సేవలనందించేవారు ఆమెతో చేతులు కలిపారు మరియు ఆర్థికంగా కూడా సహాయమందటం మొదలైంది. నేడు ఈ సంస్థ ప్రపంచ నలుమూలలకూ
విస్తరించినదై దీనులైన బీదలకు చేయూతనిచ్చుటకు చురుకుగా పనిచేస్తున్న వేలాదిమంది సభ్యులు గలదిగా ఉంది. “మనమందరమూ గొప్ప కార్యాలను చేయలేకపోవచ్చు గానీ, స్వల్ప కార్యములను గొప్ప ప్రేమతో చేయగలము.” అని మథర్ థెరిస్సా స్వయంగా చెప్పిన మాటలు ఆమె జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రియమైన వారలారా, ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయుటలో మీ పాత్ర ఏమిటి?
“ప్రియమైన ప్రభువా, మథర్ థెరిస్సాకున్నటువంటి ప్రేమతో నిండిన హృదయాన్ని నాకు అనుగ్రహించుము. ఆమేస్!"
No comments:
Post a Comment