Breaking

Friday, 2 October 2020

కాల్విన్ ఫెయిర్‌బ్యాంక్ Calvin Fairbank


19వ శతాబ్దంలో అమెరికాలో బానిసల వ్యాపారం ఎంతో విధృతంగా కొనసాగుతుండేది. అక్కడ దాఖలు చేయబడిన ఆధారాల మేరకు సరాసరి 100కోట్లు విలువ చేసే 32 లక్షలమంది బానిసలు ఆనాడు ఆ దేశంలో ఉన్నారని అంచనా. ఆ కాలంలో అమెరికా

యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువ శాతం బానిస కార్మికుల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు ఎత్తితే వారు దేశ ద్రోహులుగా పరిగణింపబడేవారు.


ఏదేమైనప్పటికీ, దేవుని ప్రేమచే తాకబడినవారు ఆ బానిస బ్రతుకుల హృదయ విదారక స్థితిని చూస్తూ ఉండలేకపోయారు. దేవుని ప్రేమను అనుభవించిన వారు బానిసల భయంకరమైన పరిస్థితిని చూస్తూ ఏ విధంగా తట్టుకొని ఉండగలరు? అమెరికా మెథడిస్టు

సేవకుడైన కాల్విస్ ఫెయిర్ బ్యాంక్ ఆ దేశంలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినవారిలో


ఒకసారి కాల్విస్ బానిసలను అమ్మే సంతకు వెళ్లారు. ఆ సమయంలో ఎలీసా అనే నీగ్రో మహిళను అమ్ముటకు అక్కడ వేలం వేస్తున్నారు. ఒక ఫ్రెంచి వ్యాపారవేత్త ఆమెను కొని తరువాత మరింత లాభదాయకమైన ధరకు అమ్ముకోవాలని తలంచాడు. అయితే వేలంపాట ప్రారంభమైనప్పుడు కాల్విస్ కూడా ఆ ఫ్రెంచి వ్యాపారవేత్తకు పోటీగా వేలం పాడటం

ప్రారంభించారు. పోటాపోటీగా జరిగిన ఆ వేలంలో చివరకు కాల్విస్ 1585 డాలర్లకు ఆ మహిళను

కొనుగోలు చేయగా, ఆమె అతని పాదముల మీద పడి విలపించటం ప్రారంభించింది. ఆ ఫ్రెంచి వ్యాపారవేత్త అతని వద్దకు వచ్చి, "మీరు ఇంత పెద్ద మొత్తంలో ధర చెల్లించి ఆమెను కొన్నారు. ఇప్పుడు ఆమెతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?" అని అడిగాడు. అందుకు "నేను ఆమెను విడుదల చేయబోతున్నాను" అని కాల్విస్ ఇచ్చిన బదులు విన్న చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయి అతని తీర్మానాన్ని అంగీకరించలేకపోయారు. అయితే ఆ బానిస స్త్రీ మాత్రం ఆనందంతో గంతులు వేసింది.


బానిసల పట్ల కాల్విస్ కలిగి ఉన్న ఆవేదనకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పారిపోయిన బానిసలకు సహాయం చేసినందుకు రెండుసార్లు పట్టుబడిన కాల్విస్ 17 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. చెరసాలలో ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని తరచుగా కొట్టబడిన కాల్విస్ యొక్క ఆరోగ్యం కోలుకోలేని విధంగా శాశ్వతంగా

దెబ్బతింది. ఏమి సంభవించినప్పటికీ, అణగారిన ప్రజలకు దేవుని ప్రేమను చూపించుటలో ఏదీ

కూడా అతనిని అడ్డుకొనలేకపోయింది.


ప్రియమైన వారలారా, క్రీస్తుని ఎరుగకుండా ఇంకా పాపపు బంధకాలలో బానిసలుగా ఉన్న వారి గురించి ఎటువంటి భారాన్ని మీరు కలిగి ఉన్నారు 


"ప్రభువా, పాపపు బానిసత్వంలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు నన్ను వాడుకొనుము. ఆమేస్!"



No comments:

Post a Comment