ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
కీర్తనలు 130: 7
ప్రియులారా
మనుషులను నమ్ముకొనుట కంటే రాజుల నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మనకెంతో మేలు ఆయన మీద ఆశ పెట్టుకొను వారు
తృప్తి నొందుదురు ఆయన శాశ్వతమైన కృపను
మన యెడల చూపుతున్నాడు మన ప్రతీ బలహీనతకు ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరకును గనుక మనము ఆయనను ఆశ్రయించు వారమై యుండాలి
భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును
వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అని
ప్రియులారా
మన ప్రతీ బలహీనతల నుండి సంపూర్ణ విమోచన
కలుగజేసి మనలను నీతిమంతులుగా చేయువాడు దేవుడే గనుక మనము ఆయన మీద ఆశపెట్టుకొని
ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయనను ఆశ్రయించు వారమై యుండాలి
ఈ వాక్యము మనకు సంపూర్ణ విమోచన
దేవుని దగ్గరనే దొరుకును కనుక ఆయన మీదనే ఆశపెట్టుకోవాలని తెలియజేస్తుంది గనుక
ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ
సంపూర్ణ విమోచన గలవారమై జీవిద్దాం
దేవుడే మనలను నీతిమంతులుగా చేయును గాక. ఆమెన్
No comments:
Post a Comment