నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
మత్తయి 12: 37
ప్రియులారా
తీర్పు దినమున మనము మాట్లాడిన ప్రతీ మాటకు
లెక్క అప్పగించు వారమై యున్నాము అందుకే మనము మన నోటిని నాలుకను భద్రము చేసుకొని జీవించాలి
దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది
కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని
మీరు బూతులైనను పోకిరి మాటలనైనను లేక వెర్రి మాటలనైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అని
ప్రియులారా
మనము దేవుని పోలికగా సృష్టింపబడిన
దేవుని పిల్లలమై యున్నాము మన నోట దేవుడు జీవ మరణములను ఉంచియున్నాడు గనుక మనము ఎల్లప్పుడూ జీవపు మాటలనే పలుక వలెను
యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు తన ఇష్టానుసారముగా ఏదియు చెప్పలేదు గాని
దేవుని చిత్తుసానుసారంగానే ప్రతీది బోధించాడు
మనము కూడా మన ఇష్టానుసారంగా మాటలాడక దేవుని వాక్యానుసారంగా ప్రతీ ఒక్కరితో మర్యాదగా
మాటలాడు వారమై యున్నాము
మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకే ఈ లోకానికి వచ్చియున్నాము గనుక మన నోట నుండి ఎల్లపుడు ఆశీర్వాదాలే పలుకు వారమై జీవిద్దాం
ఈ వాక్యము మనము నీతిమంతులవలె మాటలాడవలెనని మనకు తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులముగా జీవిద్దాం
దేవుడే మనలను నీతిమంతులనుగా మార్చును గాక ఆమెన్
No comments:
Post a Comment