Breaking

Monday, 28 September 2020

మేరీ ఫిషర్ Mary Fisher



అనేక ప్రమాదాలు, ఆపదలతో కూడుకున్న 600 మైళ్ళ భయానక ప్రయాణం అది మనలో చాలామందికి అది అసాధ్యమనిపించ వచ్చేమో గానీ, సాధ్యమేనని మేరీ ఫిషర్ నిరూపించారు. టర్కీ దేశం వెళ్ళుటకు సంకల్పించిన ఆ ప్రయాణ పరిణామాలను ఊహిస్తేనే

ఆమెలో భయం కలుగుతున్నప్పటికీ, అపరిమితమైన క్రీస్తు ప్రేమ ఆమె ఆ భయములను వీడి దేవుని కొరకు సాక్షిగా టర్కీ చేరుకొనుటకు ఆమెకు సహాయపడింది. అక్కడి సుల్తాన్ ఆమెను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి యేసు క్రీస్తును గురించిన సత్యాన్ని ఎంతో ఆసక్తితో

ఆమె నుండి తెలుసుకున్నారు. 1657లో ఆమె సంకల్పించిన ఆ ప్రయాణం పెద్దగా విజయం

సాధించకపోయినప్పటికీ అనేకులు క్రీస్తు ప్రేమను ఎరుగుటకు అది దోహదపడింది.


మేరీ ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. క్రీస్తును అంగీకరించేవరకూ ఒక దాసిగా సేవలందించిన ఈమె

అటు తరువాత “ఫ్రెండ్స్ చర్చి” (స్నేహితుల సంఘం) లో సభ్యురాలిగా చేరి, ఆ బృందం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుని వాక్యాన్ని మరియు క్రీస్తు ప్రేమను ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారు. ఆమె యొక్క బోధనలు కాథలిక్ వారి బోధనలకు

వ్యత్యాసముగా ఉండుట వలన ఆమె అనేక ఉపద్రవాలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆమె

బంధించబడి బహిరంగంగా శిక్షించబడ్డారు. ఎన్ని శ్రమలు తనను చుట్టుముట్టినప్పటికీ విశ్వాసంలో కదలక స్థిరముగా నిలబడి తన సాక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటించారు మేరీ ఫిషర్. ఉత్తర అమెరికాను సందర్శించిన కొద్దిమంది ఆది ఆంగ్ల మిషనరీలలో ఆమె కూడా ఒకరు. అక్కడ ఆమె తీవ్ర శత్రుత్వాన్ని ఎదుర్కొన్నారు. మాంత్రికురాలని ఆమె పై ఆరోపణలు వేసి ఆమె పుస్తకాలను స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. అంతేకాక ఆమెను చెరసాలలో కూడా బంధించారు. తరువాత, ఆమెను బహిష్కరించి తిరిగి ఇంగ్లాండుకు పంపించివేశారు. 

12 సంవత్సరాల మిషనరీ జీవితం మరియు చురుకైన పరిచర్య తరువాత, ఆమె వివాహం చేసుకుని తన కుటుంబ జీవితం ద్వారా దేవుని సేవను కొనసాగించారు. జీవితాంతం తన సాక్ష్యాన్ని పంచుకోవడం ఆమె ఆపలేదు. తన జీవిత చివరి ఘట్టం వరకు కూడా ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించుట కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన దైవ

సేవకురాలు ఈ మేరీ ఫిషర్.


ప్రియమైన వారలారా, దేవుడు మిమ్ములను నడిపించే ఏ స్థలానికైనా వెళ్ళి మీ సాక్ష్యాన్ని పంచుకొనుటకు మీరునూ సిద్ధముగా ఉన్నారా?


"ప్రభువా, ఎక్కడైనా సరే మీ గురించి సాక్ష్యం చెప్పుటకు నేను భయపడక నిలబడెదను. ఆమేస్!"


No comments:

Post a Comment