Breaking

Tuesday, 27 October 2020

మన విస్వాసాన్ని పెంపొందించుకోవడానికి నాలుగు మార్గాలు

 



మనము ఎటువంటి కలవరాలు లేకుండా జీవించాలన్న
దేవుడు మనకిచ్చిన వాగ్ధానాలను స్వథత్రించుకోవాలన్న దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలన్న మనము కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్ష్మనం విస్వాసం
మనలో ప్రతీ ఒక్కరము కనుపరచవలసిన లక్ష్మనం  విస్వాసం
అయితే చాలా సార్లు మన చుట్టు ఉన్న పరిస్థితులను చూసి మనుషులు చెప్పే అసత్యపు మాటలు విని మణము విస్వాసాన్ని కోల్పోతుంటాము  లేదా విస్వాసములో సన్నగిల్లి పోతాము అలాంటి సమయములో సైతాను మనల్ని నిరాశ నిస్పృహ లోకి
తీసుకువెళ్లి మనలో ఉన్న నిరీక్షణను తొలగించి
మనల్ని పతనానికి తీసుకు వెళ్లడానికి.  ప్రయత్నిస్తుంటాడు
అయితే మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి
మన విస్వాసాన్ని పెంపొందించుకోవడానికి మణము ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం


రోమీయులకు వ్రాసిన పత్రిక 12: 3 వ  వచనం ప్రకారము మనలో ప్రతీ ఒక్కరికి ఒక పరిమాణము చొప్పున దేవుడు విస్వాసాన్ని అనుగ్రహించాడు
అయితే దేవుడు మనకిచ్చిన ఆ విస్వాస పరిమానాన్ని మనము పెంచుకోవాలి
ఎలా మన విశ్వాస పరిమాన్ని పెంచుకోవాలో
మన విశ్వాస  పరిమాన్ని పెంచుకోవడానికి
ఉన్న నాలుగు మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం 


1.మొదటగా మనము దేవుని వాక్యాన్ని వినాలి
రోమీయులకు వ్రాసిన పత్రిక  10: 17 వ వచనంలో
వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
అని వ్రాయబడి ఉంది
ఈ రోజులలో దేవుని వాక్యము వినుటకు అనేకమైన మార్గములు ఉన్నాయి
మనము ఎప్పుడైతే వాక్యం వినడం నేర్చుకుంటామో అప్పుడే మన విశ్వాసం పెరగడం అనేది ప్రారంభమౌతుంది
సాదరనంగా ఒక వ్యక్తి విశ్వాసం అతడు వింటున్న దానిపైనే ఆధారపడి ఉంటుంది
డి.ఎల్ మూడీ అనే దైవజనుడు దేవుని వాక్యాన్ని వినడమును గూర్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు
నేను విశ్వాసం కోసం ప్రార్థించాను, ఏదో ఒక రోజు విశ్వాసం నాలోనికి మెరుపులాగా వచ్చి నన్ను తాకుతుందని అనుకున్నాను. కానీ, నాలోనికి విశ్వాసం వచ్చినట్లు అనిపించలేదు. ఒకరోజు నేను, రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుచుండగా, ' కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును ' అని వినబడుతుంది. నేను నా బైబిల్‌ను మూసివేసి, విశ్వాసం కోసం ప్రార్థించాను. అప్పుడు నేను నా బైబిల్‌ను తెరిచిన తరువాత, వాక్యమును ధ్యానించుటకు మొదలు పెట్టాను. మరియు అప్పటి నుండి విశ్వాసం నాలో వృద్ధిపొందుటకు ప్రారంభించెను ' అని చెప్పాడు.
ప్రియులారా
ఎంత ఎక్కువగా మనము దేవుని వాక్యాన్ని వింటామో అంత ఎక్కువగా మన విశ్వాసం వృద్ధి చెందుతుంది
ఎంత ఎక్కువగా మన విశ్వాసం వృద్ధి చెందుతుందో అంత ఎక్కువగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి గనుక మనము అసత్యమైన వాటిని అసభ్యమైనవాటిని అనగా ఈ లోక సంబంధమైన వాటిని వినకుండా ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వింటూ విశ్వాసములో బలపడుతూ
దేవుని కార్యాలు మన జీవితంలో జరగడాన్ని కళ్లారా చూద్దాం



2.మన విస్వాసాన్ని పెంచుకోవడానికి ఉన్న రెండవ మార్గం ఏంటంటే  విన్న వాక్యాన్ని విశ్వసించాలి
ప్రతీ రోజు మనము దేవుని వాక్యాన్ని ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలి పెట్టేవారముగా ఉన్నట్లయితే దాని వళ్ళ మనకెటువంటి ప్రయోజనం లేదు మనము వాక్యాన్ని వింటున్నప్పుడు మన పూర్తి శ్రద్ధను దానిపై నిలపాలి
మనము విన్న వాక్యాన్ని విశ్వసించినప్పుడే ఆ వాక్యం మనలో పని చేయడం ప్రారంభమౌతుంది
జార్జ్ ముల్లర్ అనే భక్తుడు విశ్వాస వీరుడు అనే బిరుదును పొందుకున్నాడు అంతగా అతడు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని విశ్వసించే వాడు
ఒక రోజు జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో  వంటచేసే వ్యక్తి వచ్చి ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని జార్జ్ ముల్లర్ తో అన్నాడు
అప్పుడు జార్జ్ ముల్లర్ వెంటనే దేవునికి ప్రార్ధించడం ప్రారంభించాడు
రాత్రి 7 గంటలు అయ్యింది. అప్పుడు వార్డెన్ వచ్చి అయ్యగారు ఏమి చెయ్యమంటారు? పిల్లలందరూ ఆకలితో ఉన్నారు అని అన్నాడు
అప్పుడు జార్జ్ ముల్లర్ విశ్వాసముతో
పిల్లలందరిని ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కూర్చోమని చెప్పమని చెప్పాడు
జార్జ్  ముల్లర్ గారి మాటలకు ఆ వంటవాడు, వార్డెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని  అనుకొన్నారు వెళ్లి ఆయన చెప్పినట్టుగా చేశారు
ఈలోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోనికి వచ్చింది ఆ లారీ లో నుంచి దిగిన వ్యక్తి  జార్జ్  ముల్లర్ తో ఈ విధంగా అన్నాడు
అయ్యగారు ఈ రోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చెయ్యబడింది. హటాత్తుగా పిలువబడిన ముఖ్య అతిధులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేసారు.సిద్ధ పరచిన ఆహార పదార్ధాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారని చెప్పాడు . ఆహార పదార్ధాలు లారీ నుండి దించుతూ వుండగానే, వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ 'నీవెక్కడున్నావ్?' అని అడిగాడు అందుకతడు జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర. అని చెప్పాడు అయితే, ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమాం లో ఇచ్చేసి, లారి ప్రక్కన పెట్టేయమని చెప్పాడు
ఆ లారీ లో ఉన్న మిల్క్ పాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సమృద్ధిగా సరిపోయాయి
విశ్వాసం అంటే?
పరిస్థితులు ఎలా ఉన్న  ప్రాబ్లెమ్స్గ్ఎంత పెద్దవైన దేవుడు మన జీవితంలో కార్యం చేయగలడని ఆయన మన పరిస్థులను మార్చగలడని పూర్తిగా ఆయన మీద  ఆధారపడటం
జార్జ్  ముల్లర్ అంతగా దేవుణ్ణి విశ్వసించేవాడు కాబట్టే  దేవుని నుండి గొప్ప జవాబులను పొందుకోగలిగాడు
మనము కూడా ప్రతీ రోజు దేవుని వాక్యాన్ని
వింటూ విన్న వాక్యాన్ని విశ్వసిస్తూ దేవునిపై పూర్తిగా ఆధారపడటం నేర్చుకుని
దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం



3.మన విశ్వాసాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న
మూడవ మార్గం ఏంటంటే
విన్న వాక్యాన్ని మన లోనికి తీసుకోవడం అనగా దేవుని వాక్యం మన హృదయములో నాటబడటం
ఎప్పుడైతే వాక్యం మన హృదయములో నాటబడుతుందో అప్పుడే అది ఫలిస్తుంది
మనము తప్పటడుగులు వేయకుండా తప్పుడు మార్గములో వెళ్లకుండా ఆ వాక్యం మనల్ని భద్రపరుస్తుంది లేదా మనల్ని ఆపుతుంది
యాకోబు వ్రాసిన పత్రిక 1: 21 వ వచనంలో
సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి"
అని వ్రాయబడి ఉంది
ఈ లోకమంతా కల్మషము తోనూ దుష్టత్వము తోనూ నిండి ఉంది. ఎందుకంటే ఈ లోకాధికారి దుష్టుడైన సాతాను. సాతాను మనుష్యుల హృదయములలో సమస్త కల్మషమును, దుష్టత్వమును జోప్పించాడు
ఆ దుష్టత్వము కల్మషము మన హృదయములో నుండి పోవాలి అంటే దేవుని వాక్యము అనే విత్తనము మన హృదయములలో నాటబడాలి. ఎందుకంటే  దేవుని వాక్యము పరిశుద్ధమైనది, కల్మషము లేనిది, పాల వలె నిర్మలమైనది.
ఆ పరిశుద్ధ వాక్యము అనే విత్తనము మన  హృదయములలో ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడే మన  హృదయములలో ఉన్న సమస్త కల్మషము దుష్టత్వము తొలగింపబడి మంచి చెట్టువలె మనము పెరిగి దేవుని కొరకు మంచి ఫలములు  ఫలించగలము
గనుక మనము వాక్యాన్ని మన లోనికి తీసుకొని అనగా మన హృదయమనే పలక మీద వ్రాసుకొని
ఆ వాక్య ప్రాకారంగా జీవిస్తూ విస్వాసములో బలపడదాం



4.మన విశ్వాసాన్ని పెంపొందించు కోవడానికి ఉన్న నాల్గవ మార్గం ఏంటంటే 

విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి
క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ సెలవిస్తోంది
అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు
విశ్వసించాడు కాబట్టే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సైతం దేవునికి బలిగా అర్పించడానికి  సిద్ధమయ్యాడు
విశ్వాసం క్రియలు ఇవి రెండు కలిసి ఉంటేనే పని చేస్తాయి
నాకు విస్వాసముంది క్రియలు అవసరం లేదు అంటే కుదరదు
విశ్వాసం ఉందనడానికి క్రియలే గొప్ప రుజువువును చూపిస్తాయి
అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోవడానికి ముందే అతని విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడని మనందరికి తెలుసు
అయితే అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి  వెళ్లినప్పుడు అతనిలో ఉన్న నమ్మకం సజీవమైనదని నిరూపించబడింది
అలాగే మన విశ్వాసాన్నీ కూడా దేవుడు పరిక్షిస్తాడు ఆ పరీక్షలో మనము పాస్ అయినప్పుడే విశ్వాసములో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలము 


గనుక మనము దేవుని మాటలు వింటూ ఆ మాటలను విశ్వసిస్తూ వాటిని మన హృదయములో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవిద్దాం
విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఉన్న ఈ నాలుగు  మార్గాలను మన జీవితంలో అన్వయించుకొని
విశ్వాసములో బలపడుతూ దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం






No comments:

Post a Comment