Breaking

Wednesday, 28 October 2020

డేవిడ్ సాంకీ David Sankey

 


డేవిడ్ సాంకీ ఒక సువార్త గాయకుడు మరియు పాటలు కట్టే స్వరకర్త. డ్వైట్ ఎల్. మూడీతో సుదీర్ఘ అనుబంధం కలిగినవారుగా అతను ప్రసిద్ధి పొందారు.

ఇండియానాలో జరిగిన ఒక సువార్త కూడికలో అతను పాడుటను విన్న మూడీ, 1870లో తనతో కలిసి పనిచేయుటకు సాంకీని నియమించుకున్నారు. అప్పటికి సాంకీ ఒక ఔత్సాహిక గాయకుడిగానూ, చర్చి సేవలలో పాల్గొనేవారిగాను ఉన్నారు. 1899లో మూడీ మరణం వరకు కూడా వారిరువురూ కలిసే ఏ కూడికలలో అయినా పాల్గొనేవారు. వాటన్నింటిలోనూ మూడీ ప్రసంగిస్తే, సాంకీ క్రీస్తు నామ మహిమ కొరకై పాటలు పాడేవారు.


1875లో క్రిస్మస్ పండుగ రోజున ఇంగ్లాండులో సువార్త కూడికలను ముగించుకొని వారిరువురూ ఓడలో తిరిగి వస్తున్నారు. ఆ ప్రయాణమంతటిలో సాంకీ అనేక

పాటలు పాడుతూనే ఉన్నారు. అయితే వాటిలో ఒక పాట పాడిన తరువాత మాత్రం కొంచెం మొరటుగా కనిపిస్తున్న ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి "మీరెప్పుడైనా యూనియన్ సైన్యంలో పనిచేశారా?" అని అడిగాడు. అందుకు సాంకీ అవునని జవాబివ్వగా ఆ వ్యక్తి, "నేను కూడా అదే యుద్ధంలో పోరాడాను గానీ, నేను మీ శతృ సైన్యంలో ఉన్న సైనికుడిని. ఆ యుద్ధంలో ఒకసారి నేను కాల్చుటకు మీకు గురిపెట్టినప్పుడు మీరు ఇదే పాట పాడటం విన్నాను. ఆ పాట నా హృదయాన్ని ఎంతో లోతుగా తాకడంతో మిమ్మల్ని అప్పుడు కాల్చలేకపోయాను."

అని చెప్పారు. అది వినిన సాంకీ అతనిని కౌగిలించుకొని, తరువాత అతనికి క్రీస్తును గూర్చి

తెలియచేశారు. తద్వారా ఆ వ్యక్తి క్రీస్తును అంగీకరించి రక్షణ పొందాడు.


డేవిడ్ సాంకీ ఒక సైనికుడు మాత్రమే కాదు, యుద్ధ ప్రవీణులైన సైనికులకు ఒక ఆత్మీయ నాయకుడు కూడా. సైన్యంలో పనిచేసినప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగించిన సాంకీ, పాటలు పాడటం మాత్రమే కాకుండా సైన్యంలో ఒక గాయక బృందాన్ని ఏర్పాటుచేశారు మరియు అక్కడి ప్రార్థనా మందిర నాయకునికి సహాయకుడిగా కూడా

ఉన్నారు. అతను తోటి సైనికులకు మరియు యుద్ధ ప్రవీణులైన రాణువవారికి చాలా క్రైస్తవ

ఉజ్జీవ పాటలను నేర్పించారు. ఆ పాటలు వారు ఉత్తమ క్రైస్తవులుగా జీవించుటకు

తోడ్పడ్డాయి. అతను పాడగా, అనేకమంది వారి హృదయాలలో ఆ పాటల ద్వారా గ్రుచ్చబడినవారై వారి పాప జీవితాలను విడిచిపెట్టి, నూతన జీవితము కొరకై తమను తాము క్రీస్తుకు సమర్పించుకున్నారు. అతని మరణం తరువాత కూడా క్రీస్తుకు వారి జీవితాలను అర్పించుకొనుటకు అతని పాటలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి.


"ప్రభువా, మీ నామ మహిమార్థమై గొప్ప కార్యములు చేయుటకు నన్ను బలపరచుము. ఆమేన్!


No comments:

Post a Comment