Breaking

Sunday, 25 October 2020

Daily bible verse in telugu

 


యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
కీర్తనలు 128: 1

ప్రియులారా మనుష్యులమైన మనకు లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో తెలియదు. ఎందుకంటే మనుష్యుల హృదయ తలంపులు చిన్ననాటి నుండే చెడ్డవని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆనాడు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు ఇప్పుడు మనకు యేసయ్య ఈ భూమిపై మనం ఎలా జీవించాలో మాదిరిని చూపించాడు
ఆయన త్రోవలో నడుచు వారందరు ఆయన పోలికగా మార్చబడుదురు. మనం యేసయ్య లో జీవించాలనే దేవుడు ఆశపడుతుంన్నాడు.
మహా జ్ఞానం కలిగిన సొలొమోను భక్తుడు ఈ లోకంలో అన్నిటికి అనుభవించిన తరువాత మనకు తెలియజేసిన విషయము ప్రసంగి గ్రంథములో పొందుపరిచాడు
ఈ  వాక్యములో మనం పడుతున్న ప్రయాస అంతయు వ్యర్థమని చెప్పి చివరికి ఈ విదంగా రాస్తున్నాడు
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను
మనవి కోటికీ  ఇదియే విధి అని
ప్రియులారా ఈ లోకం లో మనము ఎన్ని  సంపాదించినా మన హృదయం లో శాంతి సమాదానాలు ఉండవు గాని ఆయన మార్గం లో నడిచినట్లైతే గొప్ప సంతోషం మన హృదయం లో కలుగుతుంది
అందుకే ఆయన మార్గం లో నడుచుటకు  ప్రయాణించువారమై యుందము
ఈ వాక్యం దేవుని యందు బయట భక్తులు కలిగి ఆయన మార్గం లో జీవించాలని తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మార్గం లో నడుద్దాం దేవుని కృపమనకు తోడై యుండును గాక ఆమెన్

No comments:

Post a Comment