యేసు క్రీస్తు ఆకాశమునకు ఆరోహణమైన తరువాత తన శిష్యులు సువార్తను ప్రజలకు చెప్పుట ప్రారంభించిరి. అయితే అక్కడ ఉన్న యూదులు యేసు క్రీస్తు శిష్యులను చాలా హింసలకు గురి చేసిరి స్తెఫనును తాళ్లతో కొట్టి చంపిరి సౌలు ప్రభువు యొక్క శిష్యులను బెదురించుటయును. హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులైనా స్త్రిలైనను కనుగొని వారిని యెరుషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.
అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను
అప్పుడతడు నేలమీద పడి సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను అప్పుడు సౌలు ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును నీవు లేచి పట్టణములోనికి వెళ్లుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలిపేదననెను సౌలు నెల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక అతనితో ఉన్నవారు అతనిని దమస్కునకు తీసుకొని వెళ్లిరి అతడు మూడు రోజులు చూపు లేక ఏమియు తినక ఉండెను
దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉండెను ప్రభువు దర్శనం అందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాననెను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్లి.
యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము అతడు ప్రార్ధించుచున్నాడని చెప్పెను
అందుకు అననీయ ప్రభువా ఈ ప్రజలకు కీడు చేయుటకు అతడు బయలుదేరెనని చెప్పెను. అందుకు ప్రభువు నీవు వెళ్లుము అన్యజనుల ఎదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను అప్పుడు అననీయ వెళ్లి పౌలు మీద చేతులుంచి ప్రార్ధించగా సౌలు చూపు పొందుకొనెను అతడు లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను కొన్ని దినములు సౌలు దమస్కులో ఉండి సమాజమందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను అది విన్న వారందరు విభ్రాంతి నొందిరి అయితే పౌలు ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచెను. అప్పుడు యూదులు అతని చంపుటకు రాత్రిబగళ్ళు ద్వారము వద్ద కాచుకొని యుండిరి గనుక శిష్యులు రాత్రివేళ అతనిని గంపలో ఉంచి గోడ గుండా కిందికి దింపెను
ఆయన యెరూషలేముకు వచ్చి శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను గానీ శిష్యులు అతనిని నమ్మలేదు. బర్నబా అతనిని దగ్గరకుతీసుకుని శిష్యులతో కలిపేను. అప్పుడాయన మార్గమున జరిగినది అందరికి వివరించెను. తరువాత నుండి అందరు దైర్యంగా దేవుని గూర్చిన సత్యములను ప్రకటింపసాగిరి.
ప్రియులారా
సౌలు దేవునికి విరోధముగా ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని దర్శనము ద్వారా ఆయన మనస్సును మార్చుకున్నాడు. ఎంతగా దేవుని ప్రజలను హింసించాడో అంతకున్న ఎక్కువగా దేవునికోసం హింశించబడ్డాడు. దేవుని పనిలో గురికాలిగి జీవించాడు.
మనం కూడా నిజ దేవున్ని తెలుసుకొన్నవారము కాబట్టి ఆయనకు నమ్మకమైన వారముగా ఉండాలి. దేవుని పనిని ఆయన వారసులముగా శక్తికి మించి చేద్దాం..
కంఠతావాక్యం :
అన్యజనుల యెదుటను, రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.
-అ. కా. 9:15
మీకు ఒక ప్రశ్న
సౌలు పై చేతులుంచి ప్రార్ధించింది ఎవరు
No comments:
Post a Comment