భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.
2దినవృత్తాంతములు 2: 12
ప్రియులారా మన దేవుడు తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించిన వాడు అటువంటి మహా శక్తి గల దేవుడు మన చెయ్యి పట్టుకొని నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు అని వాగ్దానం చేస్తున్నాడు. మన కోసం తన ప్రాణాలను సహితం అర్పించిన ఆ దేవుని ప్రేమలో నిలిచియుండటం మనకు దేవుడిచ్చిన గొప్ప వరం దేవుడే మనలను కాపాడుతూ ఏ కీడు మనకు రాకుండా క్షేమంగా జీవింప చేస్తున్నాడు ఇంత గొప్ప పిల్లలుగా మనం ఉండుటకు కృప చూపిన దేవుడు స్తుతినొందును గాక
దేవుని వాక్యం ఈ విదంగా చెబుతుంది యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని
ప్రియులారా మనం ధన్యులమై యున్నాము ఆయన మన పట్ల చేసిన కార్యాలను తలుచుకుంటూ ఆయనను స్తుతించువారమై యున్నాము.
ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా ఏ దిగులు ఏ చింత లేకుండా నెమ్మది గలవారమై జీవిద్దాం ఈ వాక్యం మన సృష్టి కర్త అయినా దేవుడు స్తుతికి పాత్రుడని తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ద్యానిస్తు దేవుణ్ణి స్తుతించు వారమై జీవిద్దాం దేవుని గొప్ప రక్షణ హస్తం మనకు తోడై ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment