తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
కీర్తనలు 103: 13
ప్రియులారా పరలోకమందున్న దేవుడు మనకు తండ్రియై ఉన్నాడు.ఆయన తన పోలికగా మనలను చేసుకొని యున్నాడు. ఈ లోకంలో ఆయన ప్రజలముగా బ్రతుకుటకై ఆయన మనలను ఎన్నుకొని యున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నను ఆయనకు దూరముగా ఉండక ఆయన జాలి గలవాడు ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడని గ్రహించి ఆయన కృప కొరకై కనిపెట్టువారమై యుండాలి.
పౌలు భక్తుడు ఈ విధముగా అంటున్నారు.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింప బడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు అని
ప్రియులారా మనము దేవునియందు భయభక్తులు కలిగి ఆత్మ నడిపింపు గలవారమై యుండాలి. ఆత్మ చేత మనము శరీర క్రియలను జయించినట్లైతే దేవుని పోలికగా మనం జీవించగలము. కనుక ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తోంది కనుక ఆత్మ గదింపుకు లోబడి శరీర క్రియలను విసర్జించి దేవుని యందు భయ భక్తులతో జీవిద్దాం. ఈ వాక్యం దేవుని యందు భయ భక్తులు కలిగి ఉండుట వలన దేవుని కుమారులం అవగలం అని మనకు తెలియజేస్తుంది కనుక రోజంతా ఏ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని జాలి పొందుకొను వారమై జీవిద్దాం. దేవుని వారసులనుగా మనలను దేవుడు గొప్పగా హెచ్చించును గాక ఆమెన్
No comments:
Post a Comment