"యేసు ప్రభువా, కరుణించుము! యేసు ప్రభువా, దయచూపుము! యేసు ప్రభువా, నా ఆత్మను స్వీకరించుము!" సజీవ దహనం చేయబడే ముందు బిషప్ జాస్ హూపర్ చెప్పిన చివరి మాటలు ఇవి.
16వ శతాబ్దంలో మేరీ-1 ఆధిపత్యంలో క్రైస్తవుల మీద జరిగిన హింస ఆంగ్లేయుల చరిత్రలోని అత్యంత కూరమైన ఘట్టాలలో ఒకటిగా నిలుస్తుంది. ఆ కాలంలో క్రీస్తును వెంబడించినందుకుగాను ఎంతో చెరసాల పాలయ్యారు, హింసించబడ్డారు, మరణద్వారంలో ప్రవేశించారు అయితే, క్రీస్తులో వారికున్న దృఢమైన విశ్వాసం, ఆత్మీయంగా మరియు క్రీస్తులో స్థిరులైయుండుటకు ఎంతో మందిని ప్రోత్సాహపరిచింది. వారు చేసిన త్యాగాలు నామకార్థ క్రైస్తవులు క్రీస్తులో దొరికే విమోచనను వెదుకుటకు ప్రేరణగా నిలిచాయి. అనేకమంది క్రీస్తు యొక్క సాక్షుల మరణాలు పడిపోయిన విశ్వాసులు తమను తాము నూతనపరచుకొని విశ్వాసంలో స్థిరముగా నిలబడుటకు తోడ్పడ్డాయి.
పరిశుద్ధ గ్రంథములోని సత్యాలే తన జీవిత మూలాధారముగా భావించిన ఒక బిషప్పు ఈ జాస్ హూపర్. బిషప్పుగా అతని పదవీకాలం సమాజంలోని అన్ని స్థాయిలలో సంస్కరణలు తెచ్చిన కాలంగా గుర్తించబడింది. క్రైస్తవ సంఘంలో మతాధికారుల ఆత్మీయ అజ్ఞానాన్ని ప్రతిఘటించిన హూపర్, దైవిక శక్తిని సంఘంలో పునరుద్ధరించుటకు పలు ప్రయత్నాలు చేశారు. క్రైస్తవ సంఘం మీద పోపు యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించినందుకు అతను దోషిగా నిర్ధారించబడి మరణశిక్షకు పాత్రులయ్యారు. ఘోరమైన చెరసాలాలకే పరిమితమైన అతని బందీగృహ జీవితంలో తనను వ్యతిరేంకించిన వారిచే ఎంతో దారుణంగా వ్యవహరించబడ్డారు. అటువంటి శ్రమల మధ్యలో హూపెర్ కలిగిలియున్న ప్రార్థనా జీవితం, క్రీస్తు పైనే ఆధారపడే తత్త్వం, మరణము పొందవలసి వచ్చినా దేవుని వాక్యం మీద చెరుగని
అతని విశ్వాసం ఒక అద్భుతమైన మాదిరిని మనకు విడిచిపెట్టాయి.
1555వ సంll ఫిబ్రవరి మాసం 9వ తారీఖున, ఉదయం 9 గంటలకు, మరణశిక్షను అమలుపరచుటకుగాను జాస్ హూపర్ ను తీసుకువెళ్ళుటకు సైనికులు వచ్చారు. ఇతర బిషప్పలు చూస్తుండగా చితిని సిద్ధపరచిన ప్రదేశానికి వారు అతనిని తీసుకువెళ్ళారు. అక్కడికి చేరుకున్నప్పుడు ఆ స్థలంలో మోకరించి తన పరలోకపు తండ్రికి ప్రార్థించిన హూపర్, తన ప్రాణాన్ని దేవుని శక్తివంతమైన చేతులకు అప్పగిస్తూ మండుతున్న మంటలలోనికి నడిచారు. ప్రియమైనవారలారా, క్రీస్తును మాత్రమే సేవించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?
"ప్రభువా, మీలో ఎదుగుటకు, ఎల్లప్పుడూ మీతో ఐక్యం
కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్ !"
No comments:
Post a Comment