Breaking

Wednesday, 23 September 2020

థామస్ కోక్ Thomas Coke

 



దేవుడు ఎవరినైనా సేవకు పిలిచినప్పుడు వారు ఎలా ముందుకు సాగాలో, ఏమి సాధించాలో ఒక దర్శనాన్ని దయచేస్తాడు. అయితే దేవుని దర్శనాన్ని గ్రహించి అర్థం చేసుకొనుటకు హృదయపూర్వకంగా మనస్సు నిలుపవలెను. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు
ప్రారంభించబడినప్పటికీ ఏవైతే దైవ దర్శనం కలిగివున్నాయో అవి మాత్రమే నేటి వరకూ స్థిరముగా నిలిచి యుండగలిగాయి. సేవ విఫలమవ్వకుండా కొనసాగాలంటే దర్శనం ఉంటేనే సరిపోదు, ఆ దర్శనాన్ని వెంటాడే సమర్పణ మరియు అంకితభావం కలిగిన దైవ సేవకులుండుట ఎంతో ఆవశ్యకం. కాబట్టి, దైవ దర్శనంతో పాటు దానిని సాధించే వరకూ దానినే వెంటాడి కృషి చేయాలనే భారం, తపన మరియు పట్టుదల ఉండటం విజయవంతమైన పరిచర్యకు రహస్యం.

థామస్ కోక్ అంకితభావం మరియు సత్యం కొరకు ఎంతో తీవ్రత కలిగియున్న ఒక పాదిరి. మొదటిగా ఆంగ్లికస్ చర్చిలో సేవలందించిన థామస్ తరువాత మెథడిస్ట్ సంఘంలో చేరి ఆ సంఘ స్థాపకుడైన

జాన్ వెస్లీకు ఎంతో సన్నిహితంగా పనిచేశారు. తరువాతి కాలంలో అతను ఇంగ్లాండులోని యునైటెడ్ మెథడిస్ట్ చర్చి యొక్క మొదటి పర్యవేక్షకుడుగా (సూపరింటెండెంట్) నియమించబడ్డారు. ఎవరి నుండి ఎటువంటి సహాయమూ ఆశించకుండా తన మిషనరీ
ప్రయాణాలన్నింటినీ స్వయంగా చేపట్టిన విశ్వాస యోధులు థామస్ కోక్. తొమ్మిది సార్లు అమెరికా వెళ్లినప్పటికీ తన ప్రయాణ ఖర్చులను ఎవరైనా భరించాలని అతను ఎన్నడూ కోరుకోలేదు సరికదా తన కుటుంబ ఆస్తిపాస్తులను కూడా మిషనరీ సేవకై ధారపోశారు. అతను ఎల్లప్పుడూ తన సేవాకార్యక్రమాలతో పలు చోట్లకు తిరుగుతూనే ఉండుట వలన జాన్ వెస్లీ కోకన్ను “ది ప్లీ" (తుళ్ళు పురుగు) అని పిలిచేవారు.

అమెరికాలో ఉన్నప్పుడు బానిసత్వానికి వ్యతిరేకంగా తన గొంతు ఎత్తిన థామస్, ఫ్రాన్సిస్ ఆస్బరీతో కలిసి అక్కడి బానిసత్వ వ్యవస్థ రద్దు చేయబడాలని చాలా కృషి చేశారు.
అప్పటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టనను అతను కలిసి, దేశంలోని బానిసత్వాన్ని రద్దు
పరచమని ఆయనను అభ్యర్థించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ముందు ప్రసంగించుటకు
జార్జ్ వాషింగ్టస్ చే ఆహ్వానించబడిన ఘనత అతనికి దక్కింది. వెస్ట్ ఇండీస్ దీవులకు మరియు
ఆఫ్రికాకు కూడా సువార్తను మోసుకెళ్లిన థామస్ కోక్ స్కాట్లాండు మరియు కెనడా దేశాలలో కూడా పరిచర్యను ప్రారంభించారు. అదేవిధంగా భారతదేశం మరియు శ్రీలంకలలో కూడా మిషన్లను స్థాపించాలనే నిరీక్షణ కలిగినవారై అందుకొరకు ప్రయత్నాలను చేపట్టారు. అయితే ఆ ప్రయత్నాలలో భాగంగా అతను శ్రీలంకకు ప్రయాణిస్తూ ఆ ఓడలోనే తన చివరి శ్వాసను వదిలారు.

ప్రియమైన వారలారా, దేవుని నుండి పొందిన దర్శనము కొరకై తీవ్రతతో కృషి చేస్తున్న క్రీస్తు యొక్క సైనికుడిగా మీరు ఉన్నారా?

"ప్రభువా, భారము కలిగిన సేవకునిగా నన్ను మార్చి, ఇతరులలో కూడా అటువంటి ప్రేరణ కలిగించుటకు నాకు సహాయము చేయుము. ఆమేస్!"




No comments:

Post a Comment