Breaking

Thursday, 24 September 2020

Daily bible verse in telugu ( మేలు చేయుడి )


మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.

ఆమోసు 5: 14

ప్రియులారా మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయు వాడు దేవుని సంబంధి కాదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి నీ శత్రువులను క్షమించుడి

వారికొరకు మీ ప్రాణములను సహితం పెట్టుటకు మీరు సిద్ధపడుడి అని మన దేవుడు మనకు సెలవిచ్చాడు 

దేవుడు మన నిమిత్తం మన పాపముల నిమిత్తం 

తన ప్రాణమునే పెట్టియుండగా ఆయన వారసులమవుటకు పిలువబడినడిన మనము కూడా  

ఆయన బాటలో నడిచే వారమై యున్నాము 

 అందుకే మనము ఎవరికి కూడా కీడు తలపెట్టాలని ఆలోచించక అందరి మేలు కోరుకునే వారమై యుండాలి అప్పుడే దేవుడైన యెహోవా

మనకు తోడుగా నుండి ఆయన నామమును మన ద్వారా మహిమ పరచుకుంటాడు 

ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకములో మనము ఎంతో నెమ్మదితో బ్రతుకగలము 

ఈ వాక్యము మనము ఎవరికి కీడు చేయకుండా ఉండాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వారసులముగా జీవిద్దాం 

దేవుడే మనకు తోడై యుండును గాక. ఆమెన్ 




No comments:

Post a Comment