Breaking

Thursday, 24 September 2020

జాన్ క్రిసోస్టోమ్ jhon chrysoston


సంఘముల పునరుద్ధరణ నేటి అక్కర మాత్రమే కాదు, సంఘములు ఏర్పడిన ప్రారంభ దినాల నుండి నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. సంఘములలో జరుగుతున్న అవినీతి మరియు

అధికారం కొరకైన ఆకలిని చూచి ప్రతి నిజమైన క్రైస్తవుని యొక్క హృదయం బాధపడ్తుంది. ప్రారంభ

దినాలలో, అనేకమంది సంస్కర్తల ప్రయత్నాలు మరియు త్యాగాలు ఈ రోజున సంఘములు సజీవంగా

ఉండుటకు మరియు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సహాయపడ్డాయి. అయినప్పటికీ, ఇంకా కొన్ని

సంఘాలు పునరుద్దించబడాల్సిన అవసరం ఉంది.


అంతియొకయలో జన్మించిన జాన్ తన చిన్నతనము నుండే దేవుని యందలి భయభక్తులతో పెరిగారు. జాన్ యొక్క వాక్చాతుర్యం మరియు రాజీలేని బోధనా శైలి అతనికి 'క్రిసోస్టోమోస్' అనే పేరును సంపాదించిపెట్టాయి, దీని అర్థం 'సువర్ణమైన నోరు.' అతను న్యాయనిపుణుడిగా తన వృత్తిని ప్రారంభించారు. అయితే అతను ఆ వృత్తిలోని లోపాలు మరియు అవకతవకలను కనుగొన్నందు వలన ఆ వృత్తిని విడిచిపెట్టి ప్రార్ధన మరియు దేవుని పనిపై దృష్టి పెట్టారు. అతను అంతియొకయకు సమీపంలో ఉన్న ఒక గుహలో రెండు సంవత్సరాలు సన్యాసి జీవితాన్ని గడిపారు. తరువాత కాన్స్టాంటినోపుల్ యొక్క ఆర్చ్ బిషప్ గా నియమించబడ్డారు. మతాధికారులు పనిచేయడానికి ప్రణాళికలు మరియు క్రమశిక్షణను ఆయన రూపొందించారు.


ఆత్మీయ జీవితమునకు నష్టము కలిగించే ఏ పని చేయవద్దని ఆయన తన ప్రజలకు సలహా ఇచ్చారు. వారు తప్పుదారి పట్టకుండునట్లు వారి ఆలోచనలను ఎల్లప్పుడూ పరీక్షించుకొని బుద్ధి కలిగి నడుచుకోవాలని బోధించారు. ఆయన బోధన ఒకరి దుస్తుల ఎంపిక మరియు జీవనశైలి ద్వారా దేవునిని ఏ విధంగా ఘనపరచాలో నొక్కి చెప్పింది. సంఘాలలో సంపద మరియు అధికార దుర్వినియోగం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మతాధికారులలో మార్పు తీసుకురావాలనే అతని సంకల్పం మరియు సంఘాలలో అవినీతిని ఖండిస్తూ ఆయన చేసిన బోధ అతనికి చాలా మందిని శత్రువులనుగా చేశాయి. ఆ కారణంగా, అతన్ని ఇతర బిషన్లు అర్మేనియాకు బహిష్కరించారు, అక్కడ అతను మరణించే వరకు తన లేఖలు మరియు రచనల ద్వారా సంఘమును సంస్కరించడం కొనసాగించారు. ఆయన చేసిన లెక్కలేనన్ని విరాళాలు మరియు స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా ఆయనకు

“దాతృత్వ ప్రవక్త (ప్రోఫెట్ ఆఫ్ చారిటి)' అనే బిరుదు లభించింది. ఆయన విలువైన రచనలు ఇప్పటికీ

సంఘములను పునరుద్దీకరించుటలో తోడ్పడుతున్నాయి. అందువలన ఆయనను 'సంఘ పండితుడు (డాక్టర్ ఆఫ్ ది చర్చ్)' అని కూడా పిలుస్తారు.


ప్రియమైనవారలార, మీ పనులు మరియు చర్యలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయని మీరు విశ్వసిస్తున్నారా?


"ప్రభువా, నా ప్రతి పని ఇతరులకు ప్రయోజనకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఆమేన్!"


No comments:

Post a Comment