నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
కీర్తనలు 18: 28
ప్రియులారా దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనని ఆశ్రయించు వారందరు ఆయన వెలుగులో జీవిస్తారు. పాపము లో ఉన్నవారి హృదయం చీకటిమయమై ఉంటుంది. వారు తమ హృదయం లో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నట్లైతే దేవుని వెలుగు వారి హృదయం లో నిండిపోతుంది. అందువల్ల వారి జీవితతం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. కొన్నిసార్లు మనం శ్రమలలో చిక్కుకొని అన్ని దారులు మూసుకుపోయాయి అని బాధపడుతూ ఉంటాం. కానీ అటువంటి సమయాలలోను దేవుడు మనకు తోడైయుండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
ఇశ్రాయేలీయులు కనానుకు వెళ్తునడుపు వారికి ముందుగా ఎర్ర సముద్రం వెనక శత్రువులు ఉండిరి.
కానీ మోషే దేవుని ఆశ్రయించినపుడు గొప్ప అద్భుతం చేసి సముద్రం లో సహితం వారికి దారి కలుగ చేసాడు.
మన దేవుడు అద్భుత కరుడు కనుక మన కొరకు ఎ అద్భుతం చేయుటకైనా సామర్థ్యం గలవాడు. అందుకే ఆయనని ఆశ్రయించిన మనం ధన్యులం.
ఈ వాక్యం దేవుడు మనకి సహాయకుడై ఉన్నాడని తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వెలుగు కలిగి జీవిద్దాం.
దేవుడు మనకు వెలుగై ఉండి మన చీకటిని వెలుగుగా మార్చును గాక. ఆమెన్.
Click here :
No comments:
Post a Comment