కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
కీర్తనలు 20: 7
ప్రియులారా ఈ లోకం లో అతిశయించుటకు చాలా ఉన్నాయి డబ్బును బట్టి అతిశేయించవచ్చు. మన జ్ఞానమును బట్టి అతిశయించవచ్చు. అందమును బట్టి అతిశయించ వచ్చు ఇలా ఎన్నో విషయాలను బట్టి అతిశయించవచ్చు. కానీ అవేవి శాశ్వతమైనవి కావు అని మనము గ్రహించాలి. యోబు భక్తుడు గొప్ప ఐశ్వర్యము ఘనతలు కలిగి ఉన్నప్పటికీ వాటిని బట్టి ఆయన అతిశయపడలేదు. ఎందుకంటే అవి అన్ని అతనిని విడిచి వెళ్లినపుడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకొనెను దేవుని నామానికే స్తోత్రం అని దేవుని బట్టి ఆయన అతిశయించాడు
ప్రియులారా.. మనం కూడా దేవున్ని బట్టి మాత్రమే అతిశయించువారమై యుండాలి. ఎందుకంటె మనం కలిగి ఉన్న సమస్తము ఆయనే మనకు అనుగ్రహించాడు కాబట్టి.
ఈ వాక్యం మనము దేవున్ని బట్టి మాత్రమే అతిశయించాలని మనకి తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునియందు ఆనందిద్దాం.
దేవుడే మనకి గొప్ప ఆనందం కలుగ జేయు గాక.ఆమెన్
No comments:
Post a Comment