మీరు సమ్మలించి నా మాట వినినయెడల మీరు భూమియొక్క మంచి పదార్థములను అనుభవింతురు.
యెషయా 1:19
ప్రియులారా దేవుడు భూమిని, సర్వలోకాన్ని మనకొరకే నిర్మించాడు.ఆయన మనం ఎల్లపుడు సంతోషంగా ఉండాలనే ఆశపడుతున్నాడు అందుకే మనకు కావలసిన సమస్థమును మనకన్నా ముందుగానే నిర్మించి పెట్టాడు . మనం ఆయన మాటను విని దాని ప్రకారముగా జీవించినట్లైతే దేవుడు మనకోసం దాచిన గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలము.
ఇస్సాకు దేవుడి మాటలని విని కరువులో విత్తనములు వేసి నూరింతల పంటను పొందెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక క్రమక్రమముగా ఆయన అభివృద్ధి పొందుచుండెను.
ప్రియులారా.. ఆయన మాట జీలమై యున్నది, ఈ లోకములోను , పరలోకంలోనూ మనం నెమ్మదిగలిగి జీవించాలంటే ఆయన మాటప్రకారంగా ఉండాలి.
అప్పుడే మనం కరువులో సహితం సమృద్ధిగలవారమై జీవిస్తాం.
ఈ వాక్యం మనకు దేవుని మాటప్రకారంగా జీవించాలని తెలియజేస్తుంది.
కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ద్యానిస్తూ దేవుని మాట ప్రకారం జీవిస్తూ గొప్ప మేలులు కలవారమై ఉందాం..
దేవుని గొప్ప ఆశీర్వాదములు మనకు తోడై ఉండునుగాక.ఆమెన్
No comments:
Post a Comment