నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ 1: 9
ప్రియులారా మోషే చనిపోయిన తరువాత అతని బాధ్యతలను దేవుడు యెహోషువకు ఇస్తూ ఈ మాటలను సెలవిచ్చాడు యెహోవా దేవుడు ఇచ్చిన మాటను నమ్మిన దాని ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశం అయినా కనాను కు చేర్చ గలిగాడు
ప్రియులారా మనం కూడా ఈ లోకయాత్రలో ఉన్నాము. మనతో కుడా దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకయాత్రలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలని, ఎటువంటి పరిస్థితి వచ్చిన దిగులుపడకుండా జడియకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు . ఎందుకంటే మనము నడిచే మార్గమంతటిలో మన దేవుడే మనకు తోడై యున్నాడు గనుక. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేనికి చింతించకూడదు. మనం ఆయనకు ఇష్టమైన మార్గంలో నడిచినట్లైతే చాలు ఆయనే మనకు సమస్తము సమకూర్చువాడై యుంటాడు.
ఈ వాక్యం మనకు దేవుడే తోడై యున్నాడని మనం దైర్యం గలిగి జీవించాలని మనకు తెలియజేస్తుంది. కనుక మనం రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడిచ్చు ధైర్యము పొందుకుందాం.
దేవుడు మనకు తోడై మనలను నడిపించుగాక. ఆమెన్
No comments:
Post a Comment