యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను
కీర్తనలు 18:1
ప్రియులారా చిన్నతనం నుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించిన దావీదు భక్తుడు ఈ మాటను పలుకుతున్నాడు తన శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండియు యెహోవా అతన్ని తపించిన రోజున దావీదు తన హృదయానుసారంగా ఇలా కీర్తిస్తున్నాడు దావీదు దేవున్ని ఎంతగానో ప్రేమించాడు గనుకనే అతని శత్రువుల చేతిలో చిక్కకుండా దేవుడు కాపాడాడు. దేవుడు దావీదునకు బలముగా ఉన్నాడు.
ప్రియులారా ఈ లోకంలో మనం ప్రేమించుటకు అనేకమైనవి ఉన్నాయి. కానీ వాటి వలన మనం సమాధానముగా ఉండలేము ఈ లోకం లో మనం ప్రేమించిన ప్రతీది ఎప్పుడో ఒకసారి మనలను బాధ పెట్టేదిగానే ఉంటుంది.
కానీ మనం దేవుని ప్రేమించినట్లైతే ఆయన ద్వారా మనకు సంపూర్ణ సమాధానం కలుగుతుంది.
ఆయనను ప్రేమించిన వారికి ఈ లోకం లో ఏదియు కొదువై ఉండదు. గనుక మనం కూడా హృదయ పూర్వకంగా దేవున్ని ప్రేమించువారమై ఉండాలి.
అప్పుడే ఆయన మనకు బలమై ఉండి
మన శ్రమల నుండి విడుదల కలుగజేసీ తన సమాధానం ద్వారా మన హృదయాలను నింపుతాడు
ఈ వాక్యం మనం దేవుని ప్రేమించువారమై ఉండాలి.
ఆయనే మనకు బలమై ఉండునని తెలియజేస్తుంది
గనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవున్ని ప్రేమించువారమై జీవిద్దాం.
దేవుడు మనకు బలమైన మనకు తోడై ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment