ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము
కీర్తనలు 90: 14
ప్రియులారా దేవునికి ఉదయకాలమున ఆయన సన్నిధికి వచ్చువారంటే ఎంతో ఇష్టం. ఆయన మన ప్రథమ ఫలమును కోరుకుంటున్నాడు. మనం మన సమయంలో ప్రథమ ఫలముగా ఉదయకాలమున ఆయనతో గడిపేవారమైనట్లైతే. ఆ దినమంతా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది.
దేవుని కృప వలన ఆ రోజంతా మనం ఉత్సహించి సంతోషించు వారమై ఉంటాము. దేవుడు పౌలు భక్తునితో నా కృప నీకు చాలు అని వాగ్దానము చేసిన తరువాత పౌలు భక్తుడు దేవుని కోసం చనిపోయేంత వరకు సంతోషంతో ఆయన సేవను చేయగలిగాడు.
మనం కూడా సంతోషంతో మన రోజులను గడపాలంటే ఆయన కృప కోసం ఉదయాన్నే ఎదురుచూచే వారమై ఉండాలి. ఎవరైతే ఉదయాన్నే ఆయనకోసం కనిపెడతారో దేవుడు వారిని గొప్పగా వాడుకుంటాడు
ఈ వాక్యం మనకు ఉదయన్నే దేవుని సన్నిధిలో గడపాలని తెలియజేస్తుంది.
కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కృప కొరకు ఉదయన్నే ఎదురుచూచువారమై జీవిద్దాం.
దేవుని కృప పౌలుకి తోడుగా ఉన్నటు మనకు కూడా తోడు ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment