చార్లెస్ మీడ్
చార్లెస్ మీడ ను 'దక్షిణ ట్రావెన్కోర్ మిషస్ పితామహుడు' అని పిలుస్తారు. తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఇంగ్లాండు దేశం నుండి భారతదేశానికి వచ్చిన చార్లెస్, కొద్ది రోజుల వ్యవధిలోనే తన భార్యను మరియు మూడు నెలల బిడ్డను యవ్వన ప్రాయంలోనే
కోల్పోయారు. మిషనరీ సేవ కొరకై తమ ఆస్తులను, ప్రాణాలను కూడా కోల్పోయిన ఇతర
మిషనరీల నుండి ప్రేరణ పొందిన చార్లెస్ మీడ్ కూడా తాను ఎదుర్కొన్న నష్టాలను కూడా
స్వీకరించి, దేవుని కొరకు మరింత చురుకుగా చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు.
అతను తమిళనాడులోని మైలాడి ప్రాంతం వద్ద రింగెల్ టౌబే వదిలిపెట్టిన సేవకు బాధ్యత వహించి, దాని ప్రధాన కార్యాలయాన్ని నాగర్ కోయిల్ కు మార్చారు. అతను నివాస, భోజన వసతులు గల ఒక బోర్డింగ్ పాఠశాలను, ప్రార్థనాలయం, ముద్రణాలయము మరియు అనాథ పిల్లల కొరకు ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్ల వ్యవధిలోనే క్రీస్తు కొరకు
3000 మంది ఆత్మలను రక్షించగలిగారు. అతను 1819లో ఒక బైబిలు శిక్షణా సంస్థను (సెమినరీ) మరియు 1820లో ఎంతో మందికి ఎటువంటి కుల, మత వివక్ష లేకుండా విద్యను అందించిన ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించారు.
ఆ రోజులలో దిగువ కుల మహిళలను ఉన్నత కులాల వారు బానిసలవలె చూసేవారు మరియు
పై వస్త్రమును (పై కోటు/రవికె) ధరించుటకు
అనుమతించబడలేదు. అయితే ఈ వివక్షను వ్యతిరేకించిన చార్లెస్ మీడ్, 1822-29 మధ్య
కాలంలో తక్కువ కుల మహిళల యొక్క హక్కులు మరియు భద్రత కొరకు కృషి చేసి, అందుకొరకు సంస్థలను కూడా ప్రారంభించారు. ఈ చర్యలు ఉన్నత కులాల వారి ఉగ్రతకు దారితీయగా, వారు నెయ్యూర్ ప్రదేశంలో అనేక క్రైస్తవ గృహాలు, పాఠశాలలు మరియు ప్రార్థనాలయాలను తగలబెట్టారు. ఏదేమైనప్పటికీ, అనేక మంది మిషనరీల సమిష్టి కృషి
ఫలితంగా అట్టడుగు వర్గాల మహిళలకు కూడా హక్కులు దయచేస్తూ ఒక చట్టం
అమలుపరచబడింది.
అతను చేసిన క్రైస్తవ సేవ నిమిత్తం చార్లెస్ మీడ్ ను చంపుటకు చాలా మంది కుట్రపన్ని నప్పటికీ, వాటన్నిటినుండీ దేవుడు అతనిని అద్భుతంగా రక్షించాడు. 1818వ సం||లో కుళశ్చల్ పరిసరాలలో అడుగుపెట్టిన చార్లెస్, 35 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలోనూ మరియు తమిళనాడులో ఉన్న నెయ్యూర్ జిల్లాలోని పలు ప్రాంతాలలలో తన సేవలను అందించి వేలాది మందిని దేవుని పరలోకరాజ్య మార్గములోనికి నడిపించారు.
"ప్రభువా, మీ బిడ్డలతో కలిసి మీ రాజ్య విస్తరణ కొరకు పనిచేయుటకు నన్ను కూడా వాడుకొనుము. ఆమేస్!"
No comments:
Post a Comment